Hardik Pandya: రూ. 12 కోట్ల కారులో గర్ల్ ఫ్రెండ్తో హార్దిక్ పాండ్యా షికారు

Hardik Pandya: రూ. 12 కోట్ల కారులో గర్ల్ ఫ్రెండ్తో హార్దిక్ పాండ్యా షికారు

Hardik Pandya: టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా తన విలాసవంతమైన జీవనశైలితో నిత్యం న్యూస్ లో నిలుస్తూనే ఉంటాడు. స్టేడియంలో దూకుడుగా ఫ్యాన్స్ ను అలరించే కిల్ బిల్ పాండ్యా.. వ్యక్తిగత జీవితంలోనూ అంతే స్పీడ్ గా వెళ్తుంటారు. తాజాగా అత‌డు సుమారు రూ. 12 కోట్ల విలువైన సరికొత్త ఫెరారీ 12 సిలిండ్రి కారును కొని అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఈ లగ్జరీ కారులో తన గర్ల్‌ఫ్రెండ్ మహికా శర్మతో కలిసి ముంబై నగర వీధుల్లో షికారు చేస్తున్న వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. 

హార్దిక్ పాండ్యాకు కార్లు అంటే ప్రాణం అన్న విషయం తెలిసిందే. అతడి గ్యారేజీలో ఇప్పటికే కోట్లాది రూపాయల విలువైన కార్లు కొలువుదీరాయి. ముఖ్యంగా ఆయన దగ్గర ఉన్న లంబోర్ఘిని ఉరుస్ మోడిఫైడ్ వెర్షన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వీటితో పాటు రేంజ్ రోవర్, మెర్సిడెస్ వంటి మరెన్నో లగ్జరీ కార్లు గ్యారేజీలో ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా వచ్చి చేరిన ఫెరారీ కారు పాండ్యా కార్ల కలెక్షన్లను మరోస్థాయికి తీసుకెళ్లిపోయింది. ఈ కొత్త ఫెరారీ 12 సిలిండ్రి కారు ఫీచర్లు ఇవే: ఫెరారీ సంస్థ నుంచి వచ్చిన అత్యంత శక్తివంతమైన మోడల్స్‌.. దీని పేరుకు తగ్గట్టే ఇందులో శక్తివంతమైన V12 ఇంజన్ ని కలిగి ఉంది. ఇది కేవలం 2.9 సెకన్లలోనే 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఈ కారు గరిష్ట వేగం గంటకు 340 కిలోమీటర్లకు పైగా వెళ్తుంది.. అద్భుతమైన ఏరోడైనమిక్ డిజైన్, క్లాసిక్ లుక్‌తో ఈ కారు రోడ్డుపై వెళ్తుంటే చూసే వాళ్లు కళ్లు తిప్పుకోలేనంత స్టైలిష్‌గా కనిపిస్తుంది. 

►ALSO READ | Kolkata Knight Riders: ఆ ఇద్దరినీ వదిలిపెట్టి కేకేఆర్ పెద్ద తప్పు చేసింది.. ఐపీఎల్ ట్రోఫీ గెలవదని కుంబ్లే జోస్యం

నార్మల్ గా ఫెరారీ కార్లు అంటేనే స్పీడ్, లగ్జరీకి మారుపేరు.. ఈ 12 సిలిండ్రి మోడల్‌లో నూతన టెక్నాలజీతో కూడిన ఇంటీరియర్స్ ఉన్నాయి. డ్రైవర్ సౌకర్యం కోసం డిజిటల్ డిస్‌ప్లేలు, ప్రీమియం లెదర్ సీట్లు, అత్యుత్తమ సేఫ్టీ ఫీచర్లు ఇందులో ఇన్స్టాల్ చేశారు. ఇంత ఖరీదైన కారును మెయింటెన్ చేయడం కూడా చాలా కష్టం. కానీ పాండ్యా వంటి గ్లోబల్ స్టార్‌కు ఇది పెద్ద విషయం ఏమీ కాదు. క్రికెట్ ప్రపంచంలో కార్ల పిచ్చి ఉన్న ప్లేయర్స్ చాలా మందే ఉన్నారు. ముఖ్యంగా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ దగ్గర అరుదైన ఫెరారీ మోడల్స్ కలెక్షన్స్ కనిపిస్తాయి. అలాగే సచిన్ టెండూల్కర్ కూడా ఫెరారీకి బిగ్ ఫ్యాన్, అయితే హార్దిక్ కొనుగోలు చేసిన ఈ లేటెస్ట్ వెర్షన్ ఫెరారీ మాత్రం ప్రస్తుతం ఉన్న యాక్టివ్ క్రికెటర్లలో చాలా తక్కువ మంది దగ్గరే ఉన్నాయి.