
హైదరాబాద్, వెలుగు: సింగరేణి లాభాల్లో 50 శాతానికి పైగా కోత పెట్టి కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు ఆరోపించారు. సంస్థకు రూ. 6,394 కోట్ల లాభాలు వస్తే, కేవలం రూ. 2,360 కోట్లలో 34 శాతం ఇవ్వడం ఏమిటని సోమవారం ఓ ప్రకటనలో ప్రశ్నించారు.
దసరా పండుగ పూట కార్మికులకు రేవంత్ సర్కార్ చేదు కబురు చెప్పిందని మండిపడ్డారు. సమైక్య రాష్ట్రంలో అయినా, ఇప్పుడైనా సింగరేణి కార్మికులకు కాంగ్రెస్ పార్టీ ద్రోహమే చేస్తున్నదని విమర్శించారు.