బనకచర్లను రేవంత్ ఎందుకు అడ్డుకోవట్లే..ప్లాన్ ప్రకారమే కుట్ర.. : హరీశ్ రావు

బనకచర్లను రేవంత్ ఎందుకు అడ్డుకోవట్లే..ప్లాన్ ప్రకారమే కుట్ర.. : హరీశ్ రావు

బనకచర్ల ప్రాజెక్ట్ ను తెలంగాణ సర్కార్ ఎందుకు అడ్డుకోవడం లేదని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. ఏపీ బనకచర్లతో తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. బనకచర్ల విషయంలో  ప్లాన్ ప్రకారమే కుట్ర జరుగుతోందన్నారు.  తెలంగాణ ప్రాజెక్ట్ లకు ఏపీ ప్రభుత్వాలు అనేకసార్లు అడ్డుపడ్డాయన్నారు. కోర్టులు,ట్రిబ్యూనల్స్ లో కేసులు కూడా వేశారని చెప్పారు. 

నిబంధనలు ఉల్లంఘించి ఏపీ కొత్త ప్రాజెక్ట్ కడుతోందన్నారు హరీశ్. బనకచర్లపై తెలంగాణ,కర్ణాటక మహారాష్ట్ర అభిప్రాయాలు తీసుకోరా అని ప్రశ్నించారు. బనకచర్ల ప్రాజెక్ట్ కు కేంద్రం ఎలా అనుమతిస్తుందన్నారు హరీశ్ రావు. ఏపీలో పోలవరానికి జాతీయ హోదా ఇచ్చారు  తెలంగాణ ప్రాజెక్ట్ లకు జాతీయ హోదా ఎందుకివ్వరని ప్రశ్నించారు.

 తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడిన హరీశ్.. రేవంత్ సర్కార్ బనకచర్ల ప్రాజెక్ట్ ను ఎందుకు అడ్డుకోవడం లేదు. నీతి అయోగ్ మీటింగ్ లో రేవంత్ ఎందుకు మాట్లాడలేదు. బనకచర్లకు తరలించేది సముద్రంలో కలిసే నీళ్లు కాదు..తెలంగాణ వాడకపోవడం వల్ల కిందికి వెళ్లే నీళ్లవి. అనుమతులు లేకుండా ప్రాజెక్ట్ కడుతుంటే కాంగ్రెస్ ఎందుకు ప్రశ్నించడం లేదు. నీళ్లను ఏపీ తీసుకెళ్తుంటే కాంగ్రెస్,బీజేపీ ఎంపీలు ఎందుకు మాట్లాడటం లేదు. కేంద్రం అనుమతిస్తుంటే.. ఎంపీలు, కేంద్రమంత్రులు మొద్దు నిద్రపోతున్నారా?. ఇద్దరు కేంద్రమంత్రులు  కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎందుకు ప్రశ్నించడం లేదు. 200టీఎంసీల గోదావరి నీళ్లు తరలించే కుట్ర జరుగుతోంది. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడలేని వాళ్లకు పదవుల్లో ఉండే అర్హత ఉందా.?ఏపీలో ప్రాజెక్ట్ లకు లక్షా 60 వేల కోట్ల వరకు సాయం చేస్తున్నారు. తెలంగాణ ప్రాజెక్టులకు పైసా అయిన ఇచ్చారా? అని ప్రశ్నించారు హరీశ్.