
ఆర్గాన్ డొనేషన్ తోనే మనిషికి పునర్జన్మ లభిస్తుందన్నారు మంత్రి హరీశ్ రావు. దేశంలో అత్యధిక అవయవ మార్పిడి జరిగిన రాష్ట్రం తెలంగాణ అన్నారు. జీవన్ ధన్ కార్యక్రమంలో భాగంగా.. హైదరాబాద్ రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన 13వ డోనర్ ఫెలిసియేషన్ ప్రోగ్రాంలో పాల్గొన్నారు హరీశ్.
ALSO READ:నా జుట్టు నాకు కావాలి.. బ్యూటీ పార్లర్ సీజ్ చేయాలని బాధితురాలి డిమాండ్
ఆగస్టు 3న జాతీయ ఆర్గాన్ డే గా నిర్వహించుకుంటున్నామన్నారు హరీశ్. బాధలో ఉన్నా వేరే వారికి ఆర్గాన్ డొనేషన్ చేసే వారికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. అవయవదానం చేసిన 105 మంది కుటుంబ సభ్యులను సత్కరించారు.