రాజీనామా అంటే పారిపోయిన సీఎం రేవంత్ : ఎమ్మెల్యే హరీశ్ రావు

రాజీనామా అంటే పారిపోయిన సీఎం రేవంత్  :  ఎమ్మెల్యే హరీశ్ రావు

జగదేవపూర్, వెలుగు  :  రైతు రుణమాఫీ, ఆరు గ్యారంటీల అమలుపై సీఎం రేవంత్ రెడ్డికి రాజీనామా సవాల్ విసిరితే దేవుళ్లపై ఒట్లు పెడుతూ పారిపోతున్నాడని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ఎద్దేవా చేశారు. మంగళవారం సిద్దిపేట జిల్లా జగదేవపూర్​లో నిర్వహించిన రోడ్ షోలో మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డితో కలిసి మాట్లాడారు. కేసీఆర్​ఇంటి మీద వాలిన కాకిని వాలనియ్యను అంటూ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి, మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి, వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య, సికింద్రాబాద్ అభ్యర్థి దానం నాగేందర్ లాంటి రోజుకో పార్టీ మారే గద్దలను రేవంత్ రెడ్డి ఎత్తుకువెళ్లాడని విమర్శించారు.

 ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి వరుస పెట్టి ఓట్లు గుద్దితే గుంపు మేస్త్రి గూబ పగలాలన్నారు. అధికారంలోకి వచ్చి ఐదు నెలలైనా రుణమాఫీ చేయని సీఎం ఆగస్టు 15న రుణమాఫీ ఎలా చేస్తాడని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, ఎఫ్ డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, పీఏసీఎస్​ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, జడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, గజ్వేల్ ఏఎంసీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ గుండా రంగారెడ్డి, మర్కుక్ ఎంపీపీ పాండుగౌడ్, జడ్పీటీసీ మంగమ్మ, మర్కుక్ కర్ణాకర్ రెడ్డి ఉన్నారు.