6 నెలల తర్వాత అడుగుపెట్టిన హరీష్ రావ్

6 నెలల తర్వాత అడుగుపెట్టిన హరీష్ రావ్

తెలంగాణలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ 9 ఎంపీ స్థానాలను గెలుచుకుంది. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మెదక్ నియోజక వర్గం. ఆ స్థానం నుంచి పోటీ చేసిన ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి అఖండ మెజారిటితో విజయం సాధించారు. ఆయన విజయం వెనుక ఉన్న ఏకైక వ్యక్తి, టీఆర్ఎస్ ముఖ్య నాయకుడు హరీష్ రావ్.

ప్రభాకర్ రెడ్డి గెలుపుని ప్రతిష్టాత్మకంగా తీసుకొని, తన బావమరిది కేటీఆర్ తో చాలెంజ్ చేసి మరీ మెదక్ ఎంపీగా ప్రభాకర్ రెడ్డిని గెలిపించాడు. ఈ క్రమంలో గెలుపు సాధించిన ప్రభాకర్ రెడ్డి తన విజయానందాన్ని సీఎం కేసీఆర్ తో పంచుకునేందుకు ప్రగతి భవన్ కు వచ్చారు.ఆయనతో పాటు హరీష్ రావు కూడా ప్రగతి భవన్ కు చేరుకొని గులాబీ బాస్ ను కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్ వారికి శుభాకాంక్షలు తెలిపారు.

అయితే  తెలంగాణలో రెండవ సారి  టీఆర్ఎస్  ప్రభుత్వం ఏర్పడ్డాక  తొలిసారిగా అంటే 6 నెలల తర్వాత ప్రగతి భవన్ లో అడుగుపెట్టారు హరీష్ రావ్.

Harish rao enters into pragathi bhavan after 6 months