హైదరాబాద్, వెలుగు: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, విప్ అద్దంకి దయాకర్ పై బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ హరీశ్‌రావు పరువు నష్టం దావా వేశారు. గురువారం నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో కాంగ్రెస్ నేతలపై హరీశ్ తరఫు లాయర్లు క్రిమినల్ డిఫమేషన్ కేసు దాఖలు చేశారు.
కాంగ్రెస్ నేతల ప్రచారాలకు సంబంధించిన వీడియోలు, పేపర్ క్లిప్పింగ్స్ ను లాయర్లు కోర్టుకు సమర్పించారు. కొల్లూరు మూకాంబికా దేవి ఆలయ దర్శనానికి కుటుంబంతో కలిసి వెళ్లడాన్ని వక్రీకరించి క్షుద్ర పూజలు చేశారంటూ మహేశ్ కుమార్ గౌడ్, అద్దంకి దయాకర్ఆరోపణలు చేశారని పిటిషన్లో పేర్కొన్నారు.
