పాక్ ఆర్మీతో.. ట్రంప్ కుమారుల కంపెనీ డీల్

పాక్ ఆర్మీతో.. ట్రంప్ కుమారుల కంపెనీ డీల్

వాషింగ్టన్/ఇస్లామాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబానికి సంబంధం ఉన్న ప్రముఖ డ్రోన్ల తయారీ సంస్థ ‘పవర్సస్’.. పాకిస్తాన్ సైన్యంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విషయాన్ని పవర్సస్ సహ వ్యవస్థాపకుడు బ్రెట్ వెలికోవిచ్ వెల్లడించారు. ఈ ఒప్పందంలో భాగంగా పాక్ సైన్యం తొలి విడత డ్రోన్ల ఆర్డర్‌‌‌‌ను అప్పగించింది. భద్రతా కారణాలరీత్యా డ్రోన్ల సంఖ్య, విలువను వెల్లడించలేదు. ఇవి పూర్తిగా మానవ రహిత వైమానిక వ్యవస్థలని స్పష్టం చేశారు.

ట్రంప్ కుమారుల పెట్టుబడులు

సైనిక, పారిశ్రామిక డ్రోన్లను తయారు చేసే ‘పవర్సస్’ సంస్థ.. త్వరలో ట్రంప్ కుమారులు డొనాల్డ్ జూనియర్, ఎరిక్ ట్రంప్‌‌‌‌ల మద్దతు ఉన్న ‘ఆరియస్ గ్రీన్‌‌‌‌వే హోల్డింగ్స్’లో విలీనం కానుంది. అమెరికన్ వెంచర్స్ ఫండ్ ద్వారా ట్రంప్ కుమారులు ఇందులో వాటాలు కలిగి ఉన్నారు. విలీనం తర్వాత కొత్త కంపెనీలో వీరు 9.9 శాతం వాటా పొందనున్నారు. కాగా ఈ ఒప్పందానికి ట్రంప్ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని సీఈవో ఆండ్రూ ఫాక్స్ తెలిపారు. కాంట్రాక్ట్‌‌‌‌లు ప్రతిభ ఆధారంగానే దక్కుతాయని, వ్యాపారంలో వారి జోక్యం లేదని స్పష్టం చేశారు.