శాంతి చర్చలకు ఇబ్బందే.. శాంక్షన్ల బిల్లుపై రష్యా రియాక్షన్

శాంతి చర్చలకు ఇబ్బందే.. శాంక్షన్ల బిల్లుపై రష్యా రియాక్షన్

మాస్కో: కొత్తగా అమెరికా ఆంక్షలు విధిస్తే ఉక్రెయిన్‌‌‌‌లో శాంతి చర్చలకు ఇబ్బందులు తలెత్తుతాయని రష్యా హెచ్చరించింది. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేసే దేశాలపై కూడా కఠిన చర్యలకు అవకాశం కల్పించే బిల్లును అమెరికా ప్రతినిధుల సభ ఆమోదించిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు వచ్చాయి. 

కొత్త ఆంక్షలు శాంతియుత పరిష్కారం కోసం జరుగుతున్న ప్రయత్నాలను మరింత కష్టంగా మారుస్తాయని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ అన్నారు.‘లిండ్సే ఓ. గ్రాహం శాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్–2026’ బిల్లును అమెరికా ప్రతినిధుల సభ ఆమోదించింది.