న్యూఢిల్లీ: సెమీకండక్టర్లు/చిప్స్తయారీ కోసం కొత్తగా ప్రారంభించిన సెమికాన్ 2.0 పథకం కింద సుమారు రూ.1.15 లక్షల కోట్లు పెట్టుబడులు రానున్నాయని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఢిల్లీలో గురువారం మొదలైన సెమికాన్ ఇండియా సదస్సులో ఆయన మాట్లాడారు.
చిప్ డిజైన్, సెమీకండక్టర్ ఫ్యాబ్‌లు, ఏటీఎంపీ, ఓశాట్ యూనిట్లు, రసాయనాలు, గ్యాస్‌లు, ముడి పదార్థాల రంగాలలో ఈ పెట్టుబడులు రానున్నాయని పేర్కొన్నారు. ఈ పెట్టుబడులకు సంబంధించి ఆయా సంస్థల బోర్డులు, వాటాదారుల ఆమోదం లభించిన తర్వాత అధికారిక ప్రకటనలు వెలువడతాయని మంత్రి తెలిపారు.
ఈ భారీ ప్రాజెక్టు ద్వారా సెమీకండక్టర్ రంగంలో సుమారు పది లక్షల ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. కేంద్రం గత జులైలో రూ.1.27 లక్షల కోట్ల సెమికాన్ 2.0 పథకానికి ఆమోదం తెలిపింది.
