యూపీఐ పేమెంట్స్‌‌‌‌‌‌‌‌ చార్జీలపై కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ నిరసన : ఎంపీ మల్లు రవి

యూపీఐ పేమెంట్స్‌‌‌‌‌‌‌‌ చార్జీలపై కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ నిరసన : ఎంపీ మల్లు రవి
  •     వెంటనే రద్దు చేయాలని ఎంపీ మల్లు రవి డిమాండ్‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: యూపీఐ పేమెంట్స్‌‌‌‌‌‌‌‌పై కేంద్రం చార్జీలు విధించడాన్ని నిరసిస్తూ గురువారం గాంధీభవన్‌‌‌‌‌‌‌‌ ఎదుట కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ నేతలు, కార్యకర్తలు ప్లకార్డులతో ఆందోళన చేపట్టారు. ఎంపీ మల్లు రవి ఆధ్వర్యంలో జరిగిన నిరసనలో పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మల్లు రవి మాట్లాడుతూ.. యూపీఐ పేమెంట్స్‌‌‌‌‌‌‌‌పై విధించిన చార్జీలను కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు. 

‘‘ఇది యూపీఐ టాక్స్‌‌‌‌‌‌‌‌ కాదు.. మోదీ టాక్స్‌‌‌‌‌‌‌‌’’ అని విమర్శించారు. ప్రజలను డిజిటల్‌‌‌‌‌‌‌‌ లావాదేవీలు చేయాలని ప్రోత్సహించిన కేంద్ర ప్రభుత్వమే.. ఇప్పుడు వారికి అవి అలవాటైన తర్వాత చార్జీలు విధించడం సరికాదన్నారు. ఇది దేశ ప్రజలను మోసం చేయడమేనని ఆరోపించారు.