హైదరాబాద్ సిటీ నెట్వర్క్, వెలుగు: సెప్టెంబర్ 17 ప్రజాపాలన దినోత్సవాన్ని ప్రభుత్వ ఆఫీసులు, కలెక్టరేట్లు, వివిధ పార్టీ ఆఫీసులు, హాస్పిటల్స్ తో పాటు నగరంలోని ప్రముఖ ప్రాంతాల్లో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు, కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొని జాతీయ జెండాలు ఎగురవేశారు.
రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్ కలెక్టరేట్ లో మంత్రి దుద్దీళ్ల శ్రీధర్‌బాబు సైనిక వందనం స్వీకరించి జాతీయ పతాకం ఎగరవేశారు. తర్వాత తెలంగాణ సాయుధ పోరాట వీరులకు నివాళులర్పించారు. అనంతరం తెలంగాణ ఉద్యమంలో మరణించిన శేఖర్ రెడ్డి, సిరిపురం యాదగిరి, కాకి కుమార్, దినేశ్ చంద్ర అమరవీరుల కుటుంబసభ్యులను సత్కరించారు. ఎమ్మెల్యేలు మల్ రెడ్డి రంగారెడ్డి, వీర్నపల్లి శంకర్, కలెక్టర్ నారాయణ రెడ్డి పాల్గొన్నారు. వికారాబాద్ కలెక్టరేట్ లో జరిగిన వేడుకలకు అసెంబ్లీ స్పీకర్‌గడ్డం ప్రసాద్ కుమార్ హాజరై, జెండా ఎగురవేశారు.
ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, కలెక్టర్ దీపక్ తివారీ, ఎస్పీ స్నేహ మెహ్రా, ఏఎస్పీ రాజేశ్ మీనా, అడిషనల్కలెక్టర్లు ఉమా శంకర్ ప్రసాద్, వెంకటాచారి తదితరులు పాల్గొన్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు పాల్గొని జెండా ఎగురవేశారు. అంతకు ముందు తెలంగాణ తల్లి విగ్రహం వద్ద నివాళులర్పించి పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. కలెక్టర్ మను చౌదరి, ఉప్పల్ డీసీపీ సురేష్ కుమార్, అడిషనల్కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, విజయేందర్ రెడ్డి పాల్గొన్నారు.
తెలంగాణ పోలీస్అకాడమీలో డైరెక్టర్ అభిలాషా బిష్ట్, హైదరాబాద్కలెక్టరేట్లో కలెక్టర్ ప్రియాంక అల, జయశంకర్అగ్రికల్చర్వర్సిటీలో వీసీ ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య, నిమ్స్ హాస్పిటల్‌లో డైరెక్టర్ రాహుల్ దేవరాజ్, గాంధీ దవాఖానలో సూపరింటెండెంట్ డా. ఉషారాణి, గాంధీ మెడికల్ కాలేజీలో ప్రిన్సిపల్ డాక్టర్ ఇందిర, ముషీరాబాద్‌లో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, చార్మినార్ వద్ద టీపీసీసీ కార్యదర్శి జి. కన్నయ్యలాల్, చాంద్రాయణగుట్ట జోనల్ ఆఫీసు వద్ద , నెహ్రూ జూ పార్క్ లో , జాతీయ జెండాలను
ఎగురవేశారు.
