తెలంగాణలో రానున్న వారం రోజులు భారీ వర్షాలు

తెలంగాణలో రానున్న వారం రోజులు భారీ వర్షాలు

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలో రానున్న వారం రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు రాష్ట్రానికి ఎల్లో అలర్ట్‌‌ జారీ చేసింది. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో శుక్రవారం నుంచి వారం రోజులపాటు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. శుక్ర, శనివారాల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. 

ఆ తర్వాతి రోజుల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్‌‌లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. మరోవైపు ప్రస్తుతం వర్షాలు లేకపోవడంతో ఎండ, ఉక్కపోత తీవ్రంగా ఉన్నాయి.