హైదరాబాద్, వెలుగు: క్షుద్ర పూజలు చేశారంటూ వ్యక్తిత్వాన్ని హననం చేసేలా మాట్లాడడం తగదని, వెంటనే ఆ వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని పీసీసీ చీఫ్మహేశ్కుమార్గౌడ్ను మాజీ మంత్రి, బీఆర్ఎస్డిప్యూటీ ఫ్లోర్లీడర్హరీశ్ రావు డిమాండ్‌చేశారు. అద్దంకి దయాకర్, సామ రామ్మోహన్‌రెడ్డి వంటి వాళ్లు చేసిన కామెంట్లను రిపీట్చేశారని, కాంగ్రెస్ నేతలకు చర్చించేందుకు వేరే అంశాలు ఏవీ దొరకకపోవడం వల్లే ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
ఈ మేరకు మంగళవారం ఆయన మహేశ్‌కుమార్‌గౌడ్‌కు లీగల్‌నోటీసులు పంపారు. రాజకీయ లబ్ధి కోసం దేవుళ్లనూ వదలడం లేదన్నారు. ఆలయాలకు వెళ్లడమేమీ నిషేధం లేదని, తన పరువుకు నష్టం కలిగించేలా కామెంట్లు చేయడం దారుణమని మండిపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కోసం తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని పేర్కొన్నారు. వెంటనే తనపై చేసిన నిరాధార ఆరోపణలు వెనక్కు తీసుకోవాలన్నారు. వెబ్‌సైట్లు, సోషల్‌మీడియాల్లో పోస్ట్ చేసిన కంటెంట్‌ను వెంటనే తొలగించాలని కోరారు. లేదంటే చట్టపరంగా సివిల్, క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు.
