రేవంత్ రెడ్డిది ప్రైవేట్ లిమిటెడ్ పాలన : హరీశ్ రావు

రేవంత్ రెడ్డిది ప్రైవేట్ లిమిటెడ్ పాలన : హరీశ్ రావు

కాంగ్రెస్  రెండేళ్ల పాలనపై మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. రెండేళ్లలో ఏ వర్గానికి మేలు జరగలేదన్నారు. రేవంత్ రెడ్డిది ప్రైవేట్ లిమిటెడ్ పాలన చేస్తున్నారని ధ్వజమెత్తారు.రెండేళ్లలో హైదరాబాద్ ఆదాయం ఎంత తగ్గిందో చెప్పాలని ప్రశ్నించారు. ప్రభుత్వ విజన్, విధానం ఏంటో ప్రజలకు అర్థం కావడం లేదన్నారు. రైతుబంధు లేదు..అంగన్ వాడీలకు జీతాల్లేవన్నారు. హామీలు ,అభివృద్ధిలో రేవంత్ సర్కార్ విఫలం చెందిదన్నారు. 

మధ్యాహ్నం భోజనం వండే కార్మికులకు జీతాల్లేవన్నారు.  ఆడబిడ్డలను అన్ని రకాలుగా మోసం చేశారని విమర్శించారు హరీశ్ రావు. ఆడబిడ్డలకు ఏదో చేశామని ట్వీట్ చేయడం సిగ్గుచేటన్నారు. గ్రామ పంచాయతీలకు కనీస నిధులివ్వడం లేదన్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల పేరుతో హడావిడి చేస్తున్నారని ఫైర్ అయ్యారు. అందాల పోటీలు పెట్టి రాష్ట్రం పరువు తీశారని..పోటీ నుంచి మధ్యలోనే తప్పుకుని మిస్ ఇంగ్లాండ్ వెళ్లిపోయిందన్నారు.

రెండేళ్ల పాలనపై రేవంత్

రెండేళ్ల పాలన సందర్భంగా ట్వీట్ చేసిన సీఎం రేవంత్ .. గత పాలనలో కొన ఊపిరితో ఉన్న యువతకు ఉద్యోగాలతో కొత్త ఊపిరి పోశామని తెలిపారు. ‘‘స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీకి శ్రీకారం చుట్టాం. రుణమాఫీతో రైతుకు అండగా నిలిచి దేశానికే ఆదర్శంగా నిలిపాం. మహిళలకు ఆర్థిక మద్ధతు ఇచ్చి వ్యాపార రంగంలో నిలిపాం. కుల గణన సర్వేతో బలహీన వర్గాల వందేళ్ల ఆకాంక్షలను నెరవేర్చాం. సన్నబియ్యం, ఇందిరమ్మ ఇండ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఆడబిడ్డలకు ఉచిత బస్సు పథకం, రూ.500కే గ్యాస్, సన్న వడ్లకు రూ.500 బోనస్, కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేసే గొప్ప పథకాలన్నీ ఈ రెండేండ్ల సంక్షేమ చరిత్రకు సాక్ష్యం” అని పేర్కొన్నారు.