సీఎంఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎఫ్ చెక్కుల కేసు.. నరేశ్​తో సంబంధం లేదు - హరీశ్‌‌‌‌‌‌‌‌రావు ఆఫీస్ ప్రకటన

సీఎంఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎఫ్ చెక్కుల కేసు.. నరేశ్​తో సంబంధం లేదు -  హరీశ్‌‌‌‌‌‌‌‌రావు ఆఫీస్ ప్రకటన

హైదరాబాద్, వెలుగు :  సీఎంఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎఫ్ చెక్కుల స్కామ్‌‌‌‌‌‌‌‌లో అరెస్టయిన నరేశ్ అనే వ్యక్తితో తమకు సంబంధం లేదని మాజీ మంత్రి హరీశ్‌‌‌‌‌‌‌‌రావు కార్యాలయం బుధవారం ప్రకటించింది. నరేశ్ ప్రస్తుతం హరీశ్ రావు వద్ద పని చేయడం లేదని తెలిపింది. గతంలో కూడా హరీశ్‌‌‌‌‌‌‌‌రావుకు ఆయన పీఏగా పని చేయలేదని, కంప్యూటర్ ఆపరేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మాత్రమే పని చేశాడని చెప్పింది. ‘‘అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ ఓటమి తర్వాత డిసెంబర్ 6న మంత్రి ఆఫీసును ఖాళీ చేశాం. ఆ రోజు నుంచి నరేశ్​తో హరీశ్‌‌‌‌‌‌‌‌రావుకు, ఆయన కార్యాలయానికి సంబంధాలు లేవు. అయితే ఆఫీసు ఖాళీ చేస్తున్న క్రమంలో నరేశ్ సీఎంఆర్ఎఫ్ చెక్కులను తన వెంట తీసుకెళ్లాడు. ఈ విషయం తెలియగానే డిసెంబర్ 17న నార్సింగి పోలీస్ స్టేషన్‌‌‌‌‌‌‌‌లో ఫిర్యాదు చేశాం” అని వివరించింది. ఆ ఫిర్యాదుకు సంబంధించి పోలీసులు ఇచ్చిన అక్‌‌‌‌‌‌‌‌నాలెడ్జ్‌‌‌‌‌‌‌‌మెంట్ కాపీని మీడియాకు విడుదల చేసింది. ఈ వాస్తవాలు గుర్తించకుండా తప్పుడు ప్రచారం చేయడం బాధాకరమని  పేర్కొంది.