మొక్కలు విరిచినందుకు రూ. 5 వేలు ఫైన్‌

మొక్కలు విరిచినందుకు  రూ. 5 వేలు ఫైన్‌

సూర్యాపేటటౌన్, వెలుగు: హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను విరిచిన ఓ వ్యక్తికి ఆఫీసర్లు రూ. 5వేల ఫైన్‌ విధించారు. సూర్యాపేట పట్టణంలోని 1వ వార్డు బాలాజీనగర్‌ కు చెందిన ఆయుశ్‌ భాను కుమారుడు బుధవారం కొన్ని మొక్కలను విరిచేశాడు. దీన్ని గమనించిన మున్సిపల్‌ సిబ్బంది ఆ బాలుడి కుటుంబానికి రూ. 5 వేల ఫైన్‌ వేశారు.

అదే విధంగా అఫ్జల్‌ రైస్‌ మిల్‌ ప్రాంతంలో మంగళవారం ఓ మేక కొన్ని మొక్కలను తిన్నది. దీంతో ఆఫీసర్లు సంబంధిత మేక యజమానిని గుర్తిం చి రూ.500 ఫైన్ విధించారు.

సంస్థాన్ నారాయణపురం, వెలుగు: హరితహరంలో భాగంగా యాదాద్రి జిల్లా సర్వేల్ గ్రామంలో నాటిన మొక్కలను తింటున్న గంట మారయ్యకు చెందిన 2 మేకలను పట్టుకొని వాటి యజమానికి రూ. 600 ఫైన్‌ వేశారు.