హర్యానాలో అల్లర్లు.. శోభయాత్రతో మొదలైన ఘర్షణలు.. రాళ్ల దాడులు

హర్యానాలో అల్లర్లు.. శోభయాత్రతో మొదలైన ఘర్షణలు.. రాళ్ల దాడులు

హర్యానాలో మరోసారి అల్లర్లు కలకం రేపుతున్నాయి. మేవాత్ ప్రాంతంలో సోమవారం రెండు గ్రూపుల మధ్య ఘర్షణలు చెలరేగాయి.  మేవాత్‌లోని నుహ్‌లోని నల్హర్ మహాదేవ్ ఆలయం సమీపంలో విశ్వహిందూ పరిషత్ కార్యకర్తల వాహనాలపై కొంతమంది వ్యక్తులు రాళ్లు రువ్వారు, కాల్పులు జరిపారు.  రెండు గ్రూపులు ఒకరిపై ఒకరు రాళ్లతో దాడి చేసుకున్నాయి.

ఎక్కడిక్కడ రోడ్లమీదే కార్లు తగలబడి పోతున్నాయి.  పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో వందలాది మంది పోలీసులు ఘటనా స్థలానికి వచ్చారు. అల్లరి మూకలను చెదరగొట్టారు.  ఈ ఘర్షణకు సంబంధించిన వీడియోలు  సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

 ఫిబ్రవరిలో హర్యానాలో జరిగిన జాట్ రిజర్వేషన్ల నిరసనల్లో రోహ్‌తక్, ఝజ్జర్, సోనిపట్ అనే మూడు జిల్లాలలో 30 మంది మరణించగా.. 300 మందికి పైగా గాయపడిన సంగతి తెలిసిందే..