హ్యాట్సాఫ్ కండక్టరన్నా... నెటిజన్లు ఫిదా

హ్యాట్సాఫ్ కండక్టరన్నా... నెటిజన్లు ఫిదా

బస్సు ఎక్కిన ప్రయాణికులకు ముందుగా ఆర్టీసీ కండక్టర్ చేప్పే పని.. టికెట్ తీసుకొండి ముందు చెకింగ్ ఉందని.. కానీ ఇక్కడో కండక్టర్ మాత్రం కాస్త డిఫరెంట్... బస్సులో ఎక్కిన ప్రయాణికులకు టికెట్ కంటే ముందుగా మంచినీళ్లు ఇస్తున్నాడు.. హర్యానాకి చెందిన సురేందర్ శర్మ రోడ్‌వేస్‌లో కండక్టర్‌గా పనిచేస్తున్నాడు. ఎండలో ఇబ్బంది పడిన ప్రయాణికులకు నీళ్లు ఇస్తున్నాడు... దీనికోసం బస్సులో ఏకంగా ఓ వాటర్ క్యాన్ కూడా మెయింటైన్ చేస్తున్నాడు. అందరూ నీళ్లు తాగాక ఎక్కడికి వెళ్లాలో మర్యాదగా కనుక్కోని వారికి టికెట్ కొడుతున్నాడు.. సురేందర్ శర్మ గత 12 ఏళ్లుగా కండక్టర్‌గా పనిచేస్తున్నాడు... ఉద్యోగంలో చేరినప్పటి నుంచి అతను ఇలా బస్సులో వాటర్ సర్వీస్ చేస్తున్నాడు. సోషల్ మీడియాలో ఇతనికి సంబంధించిన న్యూస్ వైరల్ కావడంతో నెటిజన్లు అతనిని అభినందించకుండా ఉండలేకపోతున్నారు.

మరిన్ని వార్తులు

34వ వసంతంలోకి సింగర్ నేహా కక్కర్

అభివృద్ధి కోసం అందరం కలిసి పని చెయ్యాలి