34వ వసంతంలోకి సింగర్ నేహా కక్కర్

34వ వసంతంలోకి సింగర్ నేహా కక్కర్

తన అమేజింగ్ వాయిస్ తో బీ- టౌన్లో సత్తా చాటిన గాయని నేహా కక్కర్. ఫిల్మ్ ఇండస్ట్రీ తన టాలెంట్తో అందర్నీ ఆకర్షిస్తోన్న నేహా.. తాజాగా తన 34వ వసంతంలోకి అడుగుపెట్టబోతున్నారు. సాధారణ వ్యక్తిగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన నేహా.. ప్రస్తుతం సెలబ్రిటీ స్థాయికి చేరుకుని.. నేడు ప్రముఖ సింగర్లలలో ఒకరిగా నిలిచారు. ఇండియన్ ఐడల్ ద్వారా పాపులర్ అయిన ఆమె.. తర్వాతి సీజన్‌లో అదే కార్యక్రమానికి న్యాయనిర్ణేతగా వ్యవహరించి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. కాలా చష్మా, దిల్‌బర్‌ రీమిక్స్‌ వంటి ఎన్నో పాటలు ఆలపించి ప్రముఖ గాయనిగా గుర్తింపు దక్కించుకున్నారు నేహా. కేవలం బాలీవుడ్ లోనే కాదు.. పంజాబీ భాషలోనూ కొన్ని మ్యూజిక్ వీడియోస్ కూడా చేసి ప్రేక్షకులను అలరించారు.

అక్షయ్ కుమార్ హీరోగా, బ్యూటీ శృతిహాసన్ జంటగా నటించిన "గబ్బర్ ఈజ్ బ్యాక్" సినిమాలోని "ఆవో రాజా సాంగ్" తో అదరగొట్టి.. తన వాయిస్ తో అభిమానులను మూటకట్టుకున్నారు నేహా కక్కర్. అదే తరహాలో రిమిక్స్ వర్షన్ లో వచ్చిన పాపులర్ సాంగ్ "చీజ్ బడీ హై మస్త్ మస్త్" అనే పాటతోనూ ట్రెండింగ్లో నిలిచారు. "మిలే హో తుమ్" లాంటి రొమాంటిక్ సాంగ్స్ పాడడంలోనూ ఆమె గొప్ప పేరు తెచ్చుకున్నారు. ఈ విధంగా ఆమె హిందీ, నాన్ హిందీ, నాన్ ఫిల్మ్, బెంగాలీ భాషల్లోనూ పాడి ఆమె టాలెంట్ ను నిరూపించుకుంటూ వస్తున్నారు.

వీటితో పాటు తెలుగులోనూ పలు పాటలు పాడిన నేహా కక్కర్.. సినీ ప్రేక్షకులను దరికి చేర్చుకున్నారు. వీటిలో "డ్యాన్స్ మాస్టర్ 3డీ"లోని "ఓలమ్మీ సాంగ్", "కేడీ" మూవీలోని "నీవే నా నీవే నా"తో పాటు "జనియా జానే", "అలా ఎలా" సినిమాలోని "ధనాక్ ధనాక్" లాంటి పలు సాంగ్స్ పాడి తెలుగు అభిమానులను సైతం ఆకర్షించారు నేహా. జీవితంలో ఎన్నో ఆటుపోటులకు ఎదుర్కొని, ఎంతో కష్టపడి పైకి వచ్చిన నేహా కక్కర్ కు నెటిజన్స్ సైతం బర్త్ డే విషెస్ చెబుతూ తమ అభిమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.

 

మరిన్ని వార్తల కోసం...

ఏపీలో టెన్త్ ఫలితాలు విడుదల

'పుష్ప 2' ఇంట్రెస్టింగ్ అప్డేట్..