హైదరాబాద్లో క్వాంటమ్ ఏయూఎం ఆఫీస్

 హైదరాబాద్లో క్వాంటమ్ ఏయూఎం ఆఫీస్

హైదరాబాద్​, వెలుగు: క్వాంటమ్ అసెట్ మేనేజ్‌‌‌‌మెంట్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్​లో తన కొత్త రీజనల్​ఆఫీసును ప్రారంభించింది. ఈ ఏడాది నవంబర్ నాటికి తెలంగాణ నుంచి మ్యూచువల్ ఫండ్ ఆస్తుల నిర్వహణ విలువ (ఏయూఎం) సుమారు 1.37 లక్షల కోట్లకు చేరుకుందని తెలిపింది. దేశవ్యాప్త మ్యూచువల్ ఫండ్ ఆస్తులలో తెలంగాణ వాటా 2.08 శాతంగా ఉంది. ఈ సందర్భంగా  సీఈఓ సీమంత్ శుక్లా మీడియాతో మంగళవారం మాట్లాడుతూ తెలంగాణ గత 10 ఏళ్లలో ఎంతో ఆర్థిక వృద్ధిని సాధించిందని కొనియాడారు. ముఖ్యంగా హైదరాబాద్ ఐటీ,  స్టార్టప్ కంపెనీలకు ప్రధాన కేంద్రంగా మారిందని వివరించారు.