నూతనంగా ఎన్నికైన సర్పంచ్లు గ్రామాభివృద్ధి కోసం పని చేయండి : ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు

నూతనంగా ఎన్నికైన సర్పంచ్లు గ్రామాభివృద్ధి కోసం పని చేయండి  : ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు

పిట్లం, వెలుగు : నూతనంగా ఎన్నికైన సర్పంచ్​లు గ్రామాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేయాలని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు సూచించారు. మంగళవారం జుక్కల్ క్యాంపు కార్యాలయంలో పిట్లం, నిజాంసాగర్​ మండలాల్లో గెలుపొందిన సర్పంచులను సన్మానించి మాట్లాడారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజాసేవ చేయాలన్నారు. 

ఈ విజయం కాంగ్రెస్​ పార్టీపై ప్రజల మద్దతుకు నిదర్శనమని పేర్కొన్నారు. ప్రభుత్వం అందించే సంక్షేమ ఫలాలు అర్హులకు అందేలా చూడాలని తెలిపారు. పార్టీపై నమ్మకంతో విజయం అందించినందుకు ప్రజలకు న్యాయం చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఏలె మల్లికార్జున్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.