'పుష్ప 2' ఇంట్రెస్టింగ్ అప్డేట్..

'పుష్ప 2' ఇంట్రెస్టింగ్ అప్డేట్..

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో బిగ్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకి సీక్వెల్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.జూలై నుండి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది.ఈ సినిమాలో హీరో విలన్ కి మధ్య జరిగే పోరాటమే ప్రధానంగా హైలైట్ చేయనున్నారు.ఈ సినిమాలో బన్నీని సరికొత్త గెటప్ లో చూపించబోతున్నట సుకుమార్. అల్లు అర్జున్ ను ఇందులో నడివయసు పాత్రలో చూపించనున్నారని సమాచారం. సినిమా చివరలో ఆయన ఆ లుక్ తో కనిపిస్తాడా?  లేదంటే పోలీసుల బారి నుంచి తప్పించుకోవడానికి ఆయన ఆ గెటప్ వేస్తాడా? అనేది చూడాలి.

'పుష్ప'లో రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అందించన సంగీతం హైలెట్ గా నిలిచాయి. దాంతో ఈ సారి తన నుంచి అంతకు మించిన అవుట్ పుట్ ఇవ్వడానికి దేవిశ్రీ రెడీ అవుతున్నాడని చెబుతున్నారు. పుష్పలో సమంత ఐటమ్ సంచలనం సృష్టించింది. ఇప్పుడు పుష్ప-2లో కూడా ఉండబోతుంది. ఈ ఐటమ్ సాంగ్ కోసం బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీని తీసుకోనున్నట్టు తెలుస్తోంది. మరి ఈసారి దిశా పటానీ ఏ రేంజ్ అకట్టుకుంటుందో చూడాలి. బన్నీ ఫ్యాన్స్ అంతా ఆతుతాగా ఎదురు చూస్తున్న ఈ మూవీ 2023లో రిలీజ్ కానుంది.