బోధన్, వెలుగు : సకాలంలో పన్నులు చెల్లిస్తేనే బోధన్పట్టణం అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే, ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి పట్టణ ప్రజలకు సూచించారు. మంగళవారం బోధన్ మున్సిపాలిటీకి సంబంధించిన 15 చెత్తసేకరణ ఆటోలను ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఆవరణలో ప్రారంభించి మాట్లాడారు. మున్సిపల్ అధికారులు ప్రతి ఇంటి నుంచి చెత్తను సేకరించాలన్నారు.
ఎక్కడపడితే అక్కడ చెత్త పారేయకుండా ఆటోలు వచ్చినప్పుడు అందులో వేయాలన్నారు. రోడ్లపై చెత్తవేస్తే ప్రజలు అనారోగ్యం పాలవుతారని అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బీన్ హందాన్, మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు పాషామొయినొద్దీన్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎల్లయ్య, నాయకులు, మాజీ కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
