ఇలాంటి చిత్రాలను ఆదరిస్తే ఇండస్ట్రీ బాగుంటుంది: బ్రహ్మానందం

ఇలాంటి చిత్రాలను ఆదరిస్తే ఇండస్ట్రీ బాగుంటుంది: బ్రహ్మానందం

నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా బ్రహ్మానందం కీలక పాత్ర పోషించిన చిత్రం ‘గుర్రం పాపిరెడ్డి’.  మురళీ మనోహర్ దర్శకత్వంలో వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ (బాబీ) నిర్మించారు. డిసెంబర్ 19న సినిమా విడుదల కానుంది. మంగళవారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌ను నిర్వహించారు.

 ఈ సందర్భంగా బ్రహ్మానందం మాట్లాడుతూ ‘ఈ సినిమాలో నేను ఇంపార్టెంట్ రోల్ చేశా.  కథను  ప్రేక్షకులకు తెలియజేసే జడ్జి పాత్రలో నటించా.  ఇదొక డిఫరెంట్ స్టోరీ.   ఇప్పటి  ప్రేక్షకులకు నచ్చేలా కొత్త పద్ధతిలో తెరకెక్కించారు.  యోగి బాబు పాత్ర స్పెషల్ అట్రాక్షన్‌‌గా ఉంటుంది.  డిఫరెంట్ గెటప్స్‌‌లో నరేష్,  ఫరియా ఆకట్టుకుంటారు. కొత్త వాళ్లు చేసిన ఇలాంటి చిత్రాలను ఆదరిస్తే ఇండస్ట్రీ బాగుంటుంది. మరిన్ని మంచి చిత్రాలు వారు చేసే అవకాశం కలుగుతుంది’ అని అన్నారు.  నరేష్ అగస్త్య మాట్లాడుతూ ‘ఈ చిత్రంలో  నాలుగు డిఫరెంట్ గెటప్స్‌‌లో  కనిపిస్తా.  ఓల్డ్  ఏజ్ గెటప్ కోసం చాలా కష్టపడాల్సివచ్చింది. అందర్నీ ఎంటర్‌‌‌‌టైన్ చేసేలా సినిమా ఉంటుంది’ అని చెప్పాడు.  సౌదామిని పాత్రలో మెప్పిస్తానని ఫరియా అబ్దుల్లా చెప్పింది.   తెలుగు ఆడియెన్స్‌‌కు  కొత్త తరహా సినిమా చూపించబోతున్నామని దర్శక నిర్మాతలు చెప్పారు.