కోల్‌బెల్ట్, వెలుగు: సింగరేణి రిటైర్ట్ఉద్యోగులకు లాభాల వాటా, పీఎల్ఆర్బోనస్వెంటనే ఇవ్వాలని సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ వేణుమాధవ్, టీబీజీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డి డిమాండ్‌చేశారు.
మంగళవారం శ్రీరాంపూర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వేర్వేరుగా మాట్లాడారు. 2024–-25 ఆర్థిక సంవత్సరం ప్రకటించిన లాభాల వాటా, పీఎల్ఆర్ బోనస్చెల్లింపులో యాజమాన్యం జాప్యం చేస్తోందన్నారు. సర్వీస్‌లో ఉన్న ఉద్యోగులకు సెప్టెంబర్ 29న చెల్లించిందని, 3 నెలలు గడుస్తున్నా రిటైర్ట్ఉద్యోగులకు ఇవ్వకపోవడం సరికాదని పేర్కొన్నారు.
