క్రైమ్‌‌తో పాటు లవ్, క్రష్.. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌‌తో మిస్టీరియస్ మూవీ: మహి కోమటిరెడ్డి

క్రైమ్‌‌తో పాటు లవ్, క్రష్.. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌‌తో మిస్టీరియస్ మూవీ: మహి కోమటిరెడ్డి

రోహిత్, మేఘన రాజ్‌‌పుత్‌‌, అభిద్ భూషణ్, రియా కపూర్ లీడ్ రోల్స్‌‌లో మహి కోమటిరెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘మిస్టీరియస్‌‌’. జయ్ వల్లందాస్ నిర్మించారు.  ఈనెల 19న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు మహి కోమటిరెడ్డి మాట్లాడుతూ ‘విభిన్నమైన పాయింట్‌‌తో ఈ చిత్రాన్ని  తెరకెక్కించాం. ఇందులో  క్రైమ్‌‌తో పాటు లవ్, క్రష్ ఉంటాయి. అలాగే  థ్రిల్లింగ్ అంశాలూ ఉంటాయి.  చివరివరకు కిల్లర్ ఎవరు అనే  సస్పెన్స్  కొనసాగుతూనే ఉంటుంది. 

 క్లైమాక్స్‌‌ ఎపిసోడ్ అయితే  ఊహించని విధమైన  ట్విస్ట్‌‌తో థ్రిల్లింగ్‌‌గా ఉంటుంది.   మొత్తం క్రైమ్ సినిమా చూస్తున్నామనే ఫీల్ రాకుండా  మధ్యలో వచ్చే పాటలు కిక్ ఇచ్చేలా ఉంటాయి.  ఇప్పటికే రిలీజ్ చేసిన  ప్రమోషనల్ కంటెంట్‌‌కు మంచి ఫీడ్ బ్యాక్ వచ్చింది. 150కిపైగా థియేటర్స్‌‌లో మా చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. మంచి ఆదరణ దక్కుతుందనే  నమ్మకం ఉంది’ అని చెప్పాడు.