ఏపీలో టెన్త్ ఫలితాలు విడుదల

ఏపీలో టెన్త్ ఫలితాలు విడుదల
  • తొలిసారిగా మార్కుల ప్రకటన
  • వచ్చే నెల 6నుంచి సప్లిమెంటరీ పరీక్షలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో పదవ తరగతి పరీక్షల ఫలితాలను విద్యాశాఖ బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. మొత్తం 6 లక్షల 15వేల 908 మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. వారిలో 4 లక్షల 14వేల 281 మంది విద్యార్థులు ( 67.26 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ర్యాంకులపై ప్రచారం నిషేధం విధించిన ప్రభుత్వం  గతంలో మార్కుల విధానంలో ఫలితాలను ప్రకటించారు. ర్యాంకుల ప్రచారం వివాదాస్పదం కావడంతో గ్రేడింగ్ విధానం ప్రవేశపెట్టారు. అయితే మళ్లీ ఇప్పుడు మార్కుల రూపంలోనే ఫలితాలు ప్రకటించారు. 
పదో తరగతి ఫలితాల్లో బాలికలదే పైచేయి
పదో తరగతి ఫలితాల్లో బాలికలదే పైచేయిగా నిలిచిందని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. ఫలితాలను జిల్లాల వారీగా చూస్తే..78.3 శాతంతో ప్రధమ స్థానంలో   ప్రకాశం జిల్లా, అలాగే 49.7 శాతంతో చివరి స్థానంలో అనంతపురం జిల్లా నిలిచిందని వివరించారు. వచ్చేనెల 6 నుంచి పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు జరపుతామని వివరించారు. మరిన్ని వివరాలు..

రేపటి నుంచి సప్లిమెంటరీ  పరీక్ష ఫీజు కట్టుకోవచ్చు

బాలికలు 70.70 శాతం, బాలురు 64.02 శాతం ఉత్తీర్ణత

100 శాతం ఉత్తీర్ణత  సాధించిన స్కూళ్లు:  797 

ఒక్క విద్యార్థి కూడా పాస్ కాని స్కూళ్లు: 71

 

 

 

 

ఇవి కూడా చదవండి

కుక్కపై పోలీస్ కంప్లైట్

సుశాంత్ పేరుతో హోటల్ యజమానికి 8 రూ.లక్షలు టోకరా

వరుసగా రెండో రోజు 4 వేలకుపైగా కేసులు