Couple Friendly: టైటిల్ కారణంగానే ‘కపుల్ ఫ్రెండ్లీ’కు A సర్టిఫికెట్.. సెన్సార్ సూచనలపై నిర్మాత కామెంట్స్

Couple Friendly: టైటిల్ కారణంగానే ‘కపుల్ ఫ్రెండ్లీ’కు A సర్టిఫికెట్.. సెన్సార్ సూచనలపై నిర్మాత కామెంట్స్

హీరో సంతోష్ శోభన్, మిస్ ఇండియా మానస వారణాసి జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కపుల్‌ ఫ్రెండ్లీ’ (Couple Friendly) వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న తెలుగు, తమిళ భాషల్లో విడుదలకు సిద్ధమవుతోంది. యూవీ క్రియేషన్స్ సమర్పణలో, యూవీ కాన్సెప్ట్స్ నిర్మించిన ఈ చిత్రం రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కింది.

ఇటీవల విడుదలైన టీజర్, ట్రైలర్ మరియు పాటలకు ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన లభించింది. ముఖ్యంగా ఈ సినిమాలో చూపించబోతున్న స్ట్రగుల్స్, లవ్, ఎమోషన్స్, రొమాన్స్ వంటి అంశాలతో యూత్ను టార్గెట్ చేసుకుని వస్తోంది. అయితే, ఈ సినిమా విడుదలకు ఇంకా 3 రోజులే ఉండటంతో ఇంట్రెస్టింగ్ విషయాలు బయటకొస్తున్నాయి.

సినిమా విడుదలకు ఇంకా మూడు రోజులే ఉండటంతో, లేటెస్ట్గా కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. మూవీ టైటిల్ విషయంలో సెన్సార్ బోర్డు సూచనల గురించి నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని వివరాలు పంచుకున్నారు. ‘కపుల్ ఫ్రెండ్లీ’ అనే టైటిల్‌కు బదులుగా ‘ఫ్రెండ్లీ కపుల్’ అని మార్చాలని సెన్సార్ బోర్డు సూచించిందని తెలిపారు. టైటిల్ మార్చకుండా అదే పేరుతో విడుదల చేస్తే ‘A’ సర్టిఫికెట్ ఇవ్వాల్సి వస్తుందని సెన్సార్ స్పష్టం చేసినట్లు ఆయన వెల్లడించారు.

►ALSO READ | Farzi Season2: మరోసారి నకిలీ నోట్ల హంగామా.. సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ సీజన్ 2 అనౌన్స్.. కథపై క్లారిటీ ఇదే

అయితే, రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో రిస్క్ చేయకూడదనే ఉద్దేశ్యంతో ‘కపుల్‌ ఫ్రెండ్లీ’ అనే టైటిలే ఉంచినట్లుగా నిర్మాత వెల్లడించాడు. అలా ‘కపుల్ ఫ్రెండ్లీ’ అనే పేరునే కొనసాగించాలని నిర్ణయించుకున్నామని నిర్మాత తెలిపారు. ఈ కారణంగానే సినిమాకు సెన్సార్ నుంచి ‘A’ సర్టిఫికెట్ తీసుకున్నట్లు వెల్లడించారు.

అంతేకాదు, ఈ సినిమాలో ఎలాంటి అసభ్యకరమైన కంటెంట్ ఉండదని, ఇది పూర్తిగా జెన్యూన్ ఇంటెన్షన్‌తో రూపొందించిన ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అని నిర్మాత స్పష్టం చేశారు. ఈ టైటిల్ వెనుక ఉన్న అసలైన అర్థం సినిమా ప్రారంభంలోనే ప్రేక్షకులకు అర్థమవుతుందని హీరో సంతోష్ శోభన్ సైతం చెప్పుకొచ్చారు. 

ఇందులో ఇంటీరియర్ డిజైనింగ్ చేసి సరైన ఉద్యోగం లేక చెన్నైలో బైక్ పూలింగ్‌ చేస్తూ ఇబ్బందులు పడే యువకుడిగా సంతోష్‌ శోభన్‌ కనిపించనున్నాడు. టీజర్& ట్రైలర్ లో రొమాన్స్, కిస్ సీన్ యూత్కి బాగా కనెక్ట్ అవుతాయి. ఈ క్రమంలోనే మూవీ నుంచి వచ్చిన సెకండ్ సింగిల్ 'గాబరా గాబరా' సాంగ్ సైతం యూత్ ని ఆకర్షించేలా ఉంది. 

'A' సర్టిఫికేట్: ఈ సర్టిఫికేట్ పొందిన సినిమాలను 18 సంవత్సరాలు పైబడిన పెద్దలు మాత్రమే చూడాలి. ఈ సినిమాల్లో ఎక్కువ హింసాత్మక దృశ్యాలు, పూర్తి నగ్నత్వం, దూషించే భాష అన్నీ ఉంటాయి.