Farzi Season2: మరోసారి నకిలీ నోట్ల హంగామా.. సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ సీజన్ 2 అనౌన్స్.. కథపై క్లారిటీ ఇదే

Farzi Season2: మరోసారి నకిలీ నోట్ల హంగామా.. సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ సీజన్ 2 అనౌన్స్.. కథపై క్లారిటీ ఇదే

ఇండియన్ ఓటీటీ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే సిరీస్‌లలో ‘ఫర్జీ’ (Farzi) ఒకటి. బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్, కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి, హీరోయిన్ రాశీ ఖన్నా, కేకే మీనన్, భువన్ అరోరా, రెజీనా కసాండ్రా, అమోల్ పాలేకర్ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో నటించిన ఈ సిరీస్ ప్రేక్షకులపై భారీ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. 2023 ఫిబ్రవరి 10న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌కు వచ్చిన ఈ సిరీస్, నకిలీ కరెన్సీ నోట్ల నేపథ్యంలో రూపొందించి, రికార్డు స్థాయి వ్యూస్‌తో పాటు విశేష ప్రశంసలు అందుకుంది. ఈ క్రమంలోనే ‘ఫర్జీ’ సిరీస్‌కు ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.

ఇప్పుడీ సూపర్ హిట్ సిరీస్‌కు కొనసాగింపుగా ‘ఫర్జీ సీజన్ 2’ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. టాప్ క్రైమ్ థ్రిల్లర్‌గా నిలిచిన ఈ సిరీస్ రెండో భాగం పనులు ఇప్పటికే ప్రారంభమైనట్లు దర్శకులు రాజ్ & డీకే వెల్లడించారు. అత్యధికంగా వీక్షించిన ఇండియన్ వెబ్ సిరీస్‌గా రికార్డు సృష్టించిన ‘ఫర్జీ’ మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ అప్‌డేట్ రావడం ఫ్యాన్స్‌లో మరింత ఉత్సాహాన్ని నింపుతోంది.

►ALSO READ | OTT Movies: ఓటీటీ ఆడియన్స్కి పండగే.. ఈ వారం రాబోతున్న టాప్ 4 తెలుగు సినిమాలివే

మంగళవారం (ఫిబ్రవరి 10, 2026) సిరీస్ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రాజ్ & డీకే ప్రత్యేక పోస్టర్‌ను షేర్ చేశారు. నకిలీ నోట్ల కట్టలతో ఉన్న ఆ ఫోటోపై “Round 2 in Progress” అని పేర్కొన్నారు. అలాగే “Second Batch… Work in Progress (WIP)” అంటూ క్యాప్షన్ జోడించారు. దీంతో ‘ఫర్జీ సీజన్ 2’ అధికారికంగా సెట్స్‌పైకి వెళ్లేందుకు సిద్ధమైందని స్పష్టత వచ్చేసింది. ఇకపోతే, ఈ సిరీస్ మార్చిలో షూటింగ్ షురూ మొదలు పెట్టి, 2027 ఫిబ్రవరిలోనే స్ట్రీమింగ్ చేసే ఛాన్స్ ఉంది. 

సీజన్ 2 స్టోరీ ఏంటంటే..

‘ఫర్జీ’ మొదటి సీజన్ కథ పూర్తిగా దొంగ నోట్ల ముద్రణ, ఫిజికల్ కరెన్సీ చుట్టూ తిరిగింది. అయితే రెండో సీజన్‌లో కథ డిజిటల్ ప్రపంచంలోకి అడుగుపెట్టే అవకాశం ఉందని సమాచారం. క్రిప్టో కరెన్సీ మోసాలు, డిజిటల్ ఫ్రాడ్స్, టెక్నాలజీ ఆధారిత ఆర్థిక నేరాల నేపథ్యంలో కథ ముందుకు సాగే ఛాన్స్ ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొదటి భాగంలో చూపిన రియలిస్టిక్ క్రైమ్ ఎలిమెంట్స్‌ను కొనసాగిస్తూనే, కొత్త తరహా మోసాలు, సైబర్ క్రైమ్ కోణాలను జోడించి సీజన్ 2 మరింత ఉత్కంఠభరితంగా ఉండబోతుందని అంచనాలు వినిపిస్తున్నాయి.