వాలంటైన్స్ డే స్పెషల్: ఫిబ్రవరి 7 నుంచి 14 వరకు, థియేటర్/ఓటీటీలో అదిరిపోయే సినిమాలు వస్తున్నాయి. అందులో ఫ్యామిలీ, రొమాంటిక్, యాక్షన్, క్రైమ్, స్పోర్ట్స్ వంటి విభిన్న జోనర్లలో ప్రేక్షకులను అలరించే చిత్రాలు సందడి చేయనున్నాయి.
థియేటర్లో సంతోష్ శోభన్ నటించిన కపుల్ ఫ్రెండ్లీ యూత్ను టార్గెట్ చేసుకుని వస్తోంది. అలాగే మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన ఫంకీ సైతం రొమాన్స్, అనుదీప్ కేవీ మార్క్ కామెడీతో రానుంది. వీటితో పాటుగా యాక్షన్ కింగ్ అర్జున్ డైరెక్టర్గా సీతా పయనం అనే ఫ్యామిలీ లవ్ స్టోరీ వస్తోంది.
ఈ క్రమంలోనే ఓటీటీ ప్లాట్ఫామ్స్ సైతం ఏ మాత్రం తగ్గకుండా.. వరుస సినిమాలను తీసుకొస్తున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలన్నీ.. తెలుగు ఆడియన్స్ను థియేటర్లో ఉర్రుతలూగించాయి. ఇపుడు అదే మాదిరిగా ఓటీటీ ఆడియన్స్ను కూడా మెస్మరైజ్ చేయడానికి రాబోతున్నాయి. మరి ఆ సినిమాలు ఎంటి? అవెక్కడ స్ట్రీమ్ అవ్వనున్నాయి? అనేది ఓ లుక్కేద్దాం..
ఓటీటీ సినిమాలు:
మన శంకర వర ప్రసాద్ గారు - జీ5- ఫిబ్రవరి 11
February 11, it is! ♥️
— ZEE5 Telugu (@ZEE5Telugu) February 6, 2026
THE BIGGEST ANNOUNCEMENT EVER 📣 🎊 🎉
The Mega Victorious Blockbuster will see you on 11th February
ONLY on Zee5
Megastar @KChiruTweets
Victory @Venkymama@AnilRavipudi #Nayanthara @Shine_Screens @GoldBoxEnt#ManaShankarVaraPrasadGaru pic.twitter.com/zq2Nfw66c8
అనగనగా ఒక రాజు - నెట్‌ఫ్లిక్స్- ఫిబ్రవరి 11
Pattasa koluthunga, whistle adinga..Raju gaaru vandhutaan!🔥😎 pic.twitter.com/yo4eyQnces
— Netflix India South (@Netflix_INSouth) February 9, 2026
సాంప్రదాయిన సుప్పిని సుద్దపూసని - ఈటీవీ విన్- ఫిబ్రవరి 11
భర్త మహాశయులకు విజ్ఞప్తి - జీ5 - ఫిబ్రవరి 11
సాంప్రదాయిన సుప్పిని సుద్దపూసని:
90s వెబ్ సిరీస్, కోర్ట్, దండోరా సినిమాలతో ఆకట్టుకున్న శివాజీ మరో డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అదే క్రైమ్ కామెడీ ఫ్యామిలీ డ్రామా ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’. ఈ సినిమాను స్వయంగా శివాజీనే నిర్మించడం విశేషం.
►ALSO READ | Rajinikanth Movie: రజనీ నిర్మాతకు షాక్.. వెంటనే ఆ రూ.2.52 కోట్లు కట్టకపోతే జైలుకే.. హైకోర్టు కీలక తీర్పు
సుధీర్ శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో శివాజీ, లయ భార్యాభర్తలుగా నటించారు. 90స్ వెబ్ సిరీస్‌లో శివాజీకి కొడుకుగా నటించిన యంగ్ ఆర్టిస్ట్ రోహన్ ఈ సినిమాలో కూడా అదే తరహా పాత్రలో కనిపించనున్నాడు. ప్రిన్స్, అలీ, ధనరాజ్, రఘుబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ నేరుగా ఈటీవీ విన్ ఓటీటీలో ఫిబ్రవరి 12 నుంచి స్ట్రీమింగ్‌కు రానుంది.
Excited to bring you all into this world of crime, comedy, and unexpected twists. And it feels even more special to reunite with #Laya after years.
— Sivaji (@ActorSivaji) February 7, 2026
Here’s a trailer into the other side of entertainment…#SampradayiniSuppiniSuddapoosani Trailer Out Now
🔗… pic.twitter.com/ove9uOjjgq
