కుక్కపై పోలీస్ కంప్లైట్

కుక్కపై పోలీస్ కంప్లైట్

మహబూబాబాద్: కుక్క తనను కరుస్తోందంటూ ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్ మెట్లెక్కాడు. శునకంపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వినడానికి వింతగా ఉన్నా.. జిల్లాలోని గూడూరు మండలం బ్రాహ్మణపల్లిలో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే... 

బ్రహ్మణపల్లి గ్రామానికి చెందిన ధారావత్ పూల్యా నాయక్ రైతు. రోజు వ్యవసాయ శాఖ కార్యాలయం మీదుగా తన పొలానికి వెళ్తుంటాడు. అక్కడికి సమీపంలో ఉండే ఇంటి యజమాని కుక్కను పెంచుకుంటున్నాడు. అది నిత్యం పూల్యాను చూడగానే అతన్ని కరిచేందుకు మీదకొచ్చేది. గతంలో రెండుసార్లు దాని బారినపడి గాయలపాలుకాగా.. తాజాగా మరోసారి ఆ శునకం పుల్యాను కరిచింది. దీంతో రోడ్డు మీదకు వచ్చి అందరినీ కరుస్తున్న కుక్కను ఇంట్లో కట్టేయాలని దాని ఓనర్ కు చెప్పాడు. ఎంత చెప్పినా యజమాని తీరు మార్చుకోకపోవడంతో విసిగిపోయిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. తనను పదే పదే కరుస్తున్న కుక్కతో పాటు దాని యజమానిపై చర్యలు తీసుకోవాలంటూ కంప్లైట్ చేశాడు. అతను ఇచ్చిన ఫిర్యాదు చూసిన పోలీసులు తొలుత అవాక్కయ్యారు. ఆ తర్వాత తేరుకుని డాగ్ ఓనర్ను స్టేషన్ కు పిలిపించి పుల్యా నాయక్ సమక్షంలో మందలించారు. చికిత్సకయ్యే ఖర్చు భరిస్తానని కుక్క యజమానికి హామీ ఇవ్వడంతో కంప్లైంట్ వెనక్కి తీసుకున్నాడు. 

మరిన్ని వార్తల కోసం...

ఈ ఊళ్లో ఇండ్లన్నీ ఒకేలా ఉంటాయి..

ప్రజావ్యతిరేక విధానాలు తెలపడానికే రచ్చబండ