ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ మున్సిపల్ పీఠంపై కాంగ్రెస్ జెండా ఎగరాలని ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావంత్ అన్నారు. శుక్రవారం అదిలాబాద్ పట్టణంలోని 13వ వార్డు సుభాష్ నగర్ అభ్యర్థి సాజిదా బేగం తరఫున ఎన్నికల ప్రచారానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు. కులమతాల పేరుతో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే బీజేపీకి ఓటు వేయొద్దని కోరారు.
పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పేదలకు ఇండ్లు, రేషన్‌కార్డులు, యువతకు ఉద్యోగాలు ఇవ్వలేదని ఆరోపించారు. ఆదిలాబాద్ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని చెప్పారు. డీసీసీ ప్రెసిడెంట్నరేశ్ జాదవ్, నియోజకవర్గ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ నాయకులు సాజిద్ ఖాన్, గండ్రత్ సుజాత, సంజీవ్‌రెడ్డి, లైబ్రరీ చైర్మన్ మల్లెపూల నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
