ట్రెండింగ్ లో #HBDFatherOfCorruption హాష్ ట్యాగ్

ట్రెండింగ్ లో #HBDFatherOfCorruption హాష్ ట్యాగ్

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి 98వ పుట్టినరోజు సందర్భంగా ఓ పక్క డీఎంకే శ్రేణులు సంబరాలు జరుపుకుంటుంటే.. సోషల్ మీడియాలో మాత్రం కొందరు ఆయనకు వ్యతిరేకంగా పోస్టులు చేసి ట్రోల్ చేస్తున్నారు. #HBDFatherOfCorruption అనే హాష్ ట్యాగ్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాలల్లో ట్రెండింగ్ గా మారింది. ఈ సందర్భంగా తమిళనాడు సీఎం స్టాలిన్, కరుణానిధి యొక్క16 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించి, ఆయనకు నివాళులర్పించారు. అదే విధంగా సినీ నటి కుష్భూ కూడా ఆయనతో చివరిసారిగా దిగిన ఓ ఫొటోను పంచుకుని, ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

 


ఎందుకు ఫాథర్ ఆఫ్ కరప్షన్ అంటున్నారు ..?

2007లో అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ క్యాబినేట్ లో కరుణానిధి కొడుకు ఎ.రాజా టెలికాం మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించేవారు. 2008లో 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపుల్లో భాగంగా రాజా.. భారీ అవినీతి పాల్పడినట్టు తేలడంతో కరుణానిధి కుమార్తె కనిమొళితో పాటు రాజాను కూడా సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. సుమారు 1.76లక్షల కోట్ల అవినీతికి పూనుకున్నారనే వార్త అప్పట్లో సంచలనం సృష్టించింది. దాంతో కరుణానిధి సంతానం వల్ల దేశానికి భారీ నష్టం వాటిల్లిందని నమ్మిన కొందరు... ఆయన పుట్టినరోజు నాడు హ్యాపీ బర్త్ డే ఫాథర్ ఆఫ్ కరప్షన్ (అవినీతికి తండ్రిలాంటి వాడు) అని విమర్శించడం ప్రారంభించారు.

జూన్ 3, 1924లో జన్మించిన ఆయన.. రెండు దశాబ్దాల పాటు అంటే 1969 నుంచి 2011వరకు ఐదు సార్లు తమిళనాడు సీఎంగా పనిచేశారు. కరుణానిధికి ముగ్గురు భార్యలు కాగా, మొత్తం ఆరుగురు సంతానం. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కుమారుడు స్టాలిన్ అధ్యక్షతన మళ్లీ డీఎంకే పార్టీ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే.


 

మరిన్ని వార్తల కోసం..

ఒంటి కాలితో రోజుకు 2 కి.మీ నడుస్తూ పాఠశాలకు

అమ్మలు జైలుకెళ్లారని కన్నీరుమున్నీరవుతున్న చిన్నారులు