తెలంగాణలో క్రికెట్‌‌‌‌‌‌‌‌కు కొత్త జోష్‌‌‌‌‌‌‌‌

తెలంగాణలో క్రికెట్‌‌‌‌‌‌‌‌కు కొత్త జోష్‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ : బీసీసీఐ సహకారంతో తెలంగాణలో క్రికెట్‌‌‌‌‌‌‌‌ను మరింత అభివృద్ధి చేసేందుకు హెచ్‌‌‌‌‌‌‌‌సీఏ కొన్ని విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు ఆదివారం జరిగిన అపెక్స్‌‌‌‌‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌‌‌‌‌లో తీసుకున్న నిర్ణయాలను ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌ జగన్‌‌‌‌‌‌‌‌మోహన్‌‌‌‌‌‌‌‌ రావు వెల్లడించారు. తెలంగాణ క్రికెటర్ల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని హెచ్‌‌‌‌‌‌‌‌సీఏ క్రికెట్‌‌‌‌‌‌‌‌ ఆపరేషన్స్‌‌‌‌‌‌‌‌ హెడ్‌‌‌‌‌‌‌‌గా మాజీ పేసర్‌‌‌‌‌‌‌‌ వెంకటేశ్‌‌‌‌‌‌‌‌ ప్రసాద్‌‌‌‌‌‌‌‌ను నియమించేందుకు చర్చలు జరుపుతున్నామన్నారు. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ బ్రాండ్‌‌‌‌‌‌‌‌ ఇమేజ్‌‌‌‌‌‌‌‌కు తగినట్లుగా ఇంటర్నేషనల్‌‌‌‌‌‌‌‌ స్టేడియాన్ని నిర్మించేందుకు గవర్నమెంట్‌‌‌‌‌‌‌‌తో చర్చిస్తున్నామన్నారు.

మూడు జిల్లా కేంద్రాల్లో స్టేడియాలు నిర్మిస్తామన్న ఆయన మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌లో టర్ఫ్‌‌‌‌‌‌‌‌ వికెట్‌‌‌‌‌‌‌‌, నిజామాబాద్‌‌‌‌‌‌‌‌ స్టేడియం చుట్టు ఫెన్సింగ్‌‌‌‌‌‌‌‌ను చేపడతామన్నారు. 2018 నుంచి పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్న అడిట్‌‌‌‌‌‌‌‌లను ఆమోదించామని, వీటిని త్వరలోనే బీసీసీఐకి పంపించి నిధులు రాబడతామని జగన్‌‌‌‌‌‌‌‌ తెలిపారు. పెండింగ్‌‌‌‌‌‌‌‌ బిల్లుల చెల్లింపుపై కమిటీ వేశామని దాని ప్రకారం ముందుకెళ్తామన్నారు. ఈ నెల 8 నుంచి డొమెస్టిక్‌‌‌‌‌‌‌‌ షెడ్యూల్‌‌‌‌‌‌‌‌ను మొదలుపెడతామని సెక్రటరీ దేవ్‌‌‌‌‌‌‌‌రాజ్‌‌‌‌‌‌‌‌ తెలిపారు. విమెన్స్‌‌‌‌‌‌‌‌ లీగ్‌‌‌‌‌‌‌‌ను కూడా ప్రారంభించేందుకు రోడ్‌‌‌‌‌‌‌‌ మ్యాప్‌‌‌‌‌‌‌‌ను సిద్ధం చేస్తున్నామని ప్రకటించారు.