హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో TG20 లీగ్ ప్రారంభం కానుంది. తెలంగాణలో తొలి ఫ్రాంచైజీ ఆధారిత టీ20 క్రికెట్ లీగ్‌గా TG20 జరగనుంది. బేగంపేట్ ఓ హోటల్లో జరిగిన కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, నిర్వాహకులు పాల్గొన్నారు.
తొలి సీజన్‌లో తెలంగాణకు చెందిన 8 టీమ్స్ పోటీ పడనున్నాయి. తెలంగాణ క్రికెట్ ప్రతిభ, అభిరుచి, సంస్కృతిని ప్రతిబింబించేలా జట్ల ఎంపిక ఉండనుంది. తెలంగాణ యువ క్రికెటర్లకు మెరుగైన అవకాశాలే లక్ష్యంగా లీగ్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.
దేశీయ స్థాయి ఆటగాళ్లతో పాటు తెలంగాణ యువతకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. అనుభవజ్ఞులైన కోచ్‌లు, ప్రొఫెషనల్ నిర్వహణతో లీగ్ నిర్వహిస్తున్నట్లు HCA తెలిపింది. స్టార్ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారాల కోసం జియోస్టార్‌తో చర్చలు కొనసాగుతున్నాయని పేర్కొంది. HCA ఈ టీజీ20 టీమ్‌ల బిడ్‌లను తెరిచింది. HCA జూన్ 7న టీజీ20 క్రికెటర్ల వేలం నిర్వహించనుంది. జూన్ 20న టీజీ20 తొలి మ్యాచ్ జరుగుతుంది. ఫైనల్ మ్యాచ్ జులై 11న ఉంటుంది.
బిడ్డర్ల వివరాలు:
* ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ – ₹7.50 కోట్లు – హైదరాబాద్
* బూరుగు ఇన్‌ఫ్రా/ప్రణవ – ₹7.20 కోట్లు – రంగారెడ్డి
* బైన్ గ్లోబల్ రిసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ – ₹6.55 కోట్లు – వరంగల్
* భృందా ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ – ₹6.33 కోట్లు – మెదక్
* కిషోర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ – ₹5.06 కోట్లు – నల్గొండ
* EIPL గ్రూప్ & తిబరుమాల్ – ₹4.57 కోట్లు – కరీంనగర్
* వీరభద్ర స్టీల్స్ – ₹4.50 కోట్లు – మహబూబ్‌నగర్
* అన్విత గ్రూప్ – ₹4.44 కోట్లు – ఖమ్మం
