హెచ్‌‌‌‌‌‌‌‌డీఎఫ్‌‌‌‌‌‌‌‌సీ లోన్లపై తగ్గిన వడ్డీ.. అయితే ఈ లోన్లకు మాత్రం ఇది వర్తించదు !

హెచ్‌‌‌‌‌‌‌‌డీఎఫ్‌‌‌‌‌‌‌‌సీ లోన్లపై తగ్గిన వడ్డీ.. అయితే ఈ లోన్లకు మాత్రం ఇది వర్తించదు !

న్యూఢిల్లీ: హెచ్‌‌‌‌‌‌‌‌డీఎఫ్‌‌‌‌‌‌‌‌సీ బ్యాంక్ కొన్ని లోన్ టెన్యూర్లపై మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్‌‌‌‌‌‌‌‌ లెండింగ్ రేట్‌‌‌‌‌‌‌‌ (ఎంసీఎల్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–బ్యాంక్ వేసే కనీస వడ్డీ రేటు) ను 5 బేసిస్ పాయింట్లు (0.05 శాతం) వరకు తగ్గించింది. తాజా ఎంసీఎల్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రేట్లు 8.55 శాతం నుంచి 8.75శాతం మధ్య ఉన్నాయి. ఓవర్‌‌‌‌‌‌‌‌నైట్, వన్ మంత్ ఎంసీఎల్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 8.55శాతం వద్ద స్థిరంగా ఉండగా, మూడు నెలల రేటు 8.60శాతం వద్ద కొనసాగుతుంది.

సిక్స్ -మంత్, వన్ ఇయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎంసీఎల్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 8.70శాతం నుంచి 8.65శాతానికి తగ్గింది. రెండేళ్ల ఎంసీఎల్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 8.70శాతం, మూడేళ్ల  ఎంసీఎల్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 8.75శాతం వద్ద కొనసాగుతోంది. ఎంసీఎల్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో లింకైన హోం లోన్, కార్ లోన్, పర్సనల్  లోన్‌‌‌‌‌‌‌‌లపై వడ్డీ  ఈ తగ్గింపుతో దిగొస్తుంది.  అయితే,  ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ  రెపో రేట్‌‌‌‌‌‌‌‌కు లింకై ఉన్న లోన్లకు ఇది వర్తించదు. ఎంసీఎల్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తగ్గించడంతో బారోవర్ల ఈఎంఐ తగ్గే అవకాశం ఉంది.