సినిమాల్లో అవ‌కాశం ఇప్పిస్తానంటూ యువ‌తిని మోసం చేశాడు

సినిమాల్లో అవ‌కాశం ఇప్పిస్తానంటూ యువ‌తిని మోసం చేశాడు

వైజాగ్ : ‌రూ.5 ల‌క్ష‌లు ఇస్తే సినిమాల్లో న‌టించే అవ‌కాశం ఇప్పిస్తానంటూ యువ‌తిని మోసం చేశాడు వైజాగ్ కి చెందిన ఓ వ్యక్తి. పెద్ద సినిమాల్లో డాన్సర్ గా అవకాశం ఇప్పిస్తానని వైజాగ్ లోని గీతాలయ స్టూడియోస్ కు చెందిన గీతా ప్రసాద్‌ ఆమెకు చెప్పాడు. సినిమా పరిశ్రమలో త‌న‌కు మంచి పరిచయాలున్నాయంటూ మాయ మాటలతో ఆమెను నమ్మించి.. ఆ యువతి నుంచి రూ. 5లక్షలు తీసుకున్నాడు.

డబ్బులు తీసుకున్న తర్వాత ముఖం చాటేశాడు. ఇటీవ‌ల క‌నిపించిన‌ ప్రసాద్ ‌ను యువ‌తి నీలదీయడంతో చివరికి బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు పోలీసులును ఆశ్రయించింది. మోసగాడిపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టిన‌ట్లు తెలిపారు.