18న అండమాన్​లో మరో ఆవర్తనం!

 18న అండమాన్​లో మరో ఆవర్తనం!

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆది, సోమ వారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే చాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం శనివారం ప్రకటించింది. కొన్ని రాష్ట్రాల నుంచి నైరుతి రుతుపవనాలు వెనక్కి  మళ్లుతాయని తెలిపింది.ఈ నెల18న ఉత్తర అండమాన్ దాని పరిసర ప్రాంతాల్లో ఒక ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ ఆవర్తనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఈ నెల 20న పశ్చిమ మధ్య బంగాళాఖాతం లేదా దాని పరిసర ప్రాంతాల్లోని నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారవచ్చని పేర్కొంది.