హైదరాబాద్, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ప్రమేయం ఉందని ఆరోపణలు చేసిన కాంగ్రెస్, బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవడం లేదంటూ బీఆర్‌ఎస్ వేసిన పిటిషన్లపై హైకోర్టు విచారణను ముగించింది. బీఆర్‌ఎస్ నేతల ఫిర్యాదులపై చట్టప్రకారం తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని ఈసీ తరపు అడ్వొకేట్ చెప్పడంతో పిటిషన్లపై విచారణను హైకోర్టు ముగించింది. తమ ఫిర్యాదుపై ఈసీ చర్యలు తీసుకోవడం లేదంటూ బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ముగిస్తున్నామని చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె.అనిల్ కుమార్ తో కూడిన బెంచ్ గురువారం ప్రకటించింది.
