ఎండ తాకిడి.. వేడి గాలులు.. తెలంగాణలో వడదెబ్బతో 13 మంది మృతి..

ఎండ తాకిడి.. వేడి గాలులు.. తెలంగాణలో వడదెబ్బతో 13 మంది మృతి..

వెలుగు, నెట్‌వర్క్‌: రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం వడదెబ్బతో 13 మందికి పైగా చనిపోయారు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో వడదెబ్బతో ఇద్దరు గ్రామపంచాయతీ మల్టీపర్పస్ వర్కర్లు చనిపోయారు. దుబ్బతండాకు చెందిన బానోత్  రమేశ్(39), రేలకాయలపల్లికి చెందిన పాయం వెంకటనరసయ్య(52), తల్లాడ మండలం నారాయణపురం గ్రామానికి చెందిన దాసరి గంగమ్మ (60), ములుగు జిల్లా వెంకటాపురం సూరవేడు గ్రామానికి చెందిన ట్రాక్టర్​ డ్రైవర్​ తాటి నరేశ్(34), వరంగల్​ జిల్లా చెన్నారావుపేట మండలం జల్లి గ్రామానికి చెందిన సంపంగి ఎల్లమ్మ(73), రాయపర్తి మండలం కొత్తూరు గ్రామానికి చెందిన ఆకారపు మల్లికాంబ(59), భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం బచ్చల కోయగూడెం గ్రామానికి చెందిన జబ్బా రామనాథం(55), మణుగూరు మండలం కట్టుమల్లారం గ్రామానికి చెందిన పడిదల చిన్న ముత్తయ్య(70), అశ్వాపురం మండలం జగ్గారం గ్రామానికి చెందిన అమ్మినేని అమృతమ్మ(80), దమ్మపేట మండలం మందలపల్లి గ్రామానికి చెందిన లోచర్ల పాపమ్మ(65), అశ్వారావుపేట మండలం వినాయకపురం గ్రామానికి చెందిన దాబా దుర్గయ్య (65) ,మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం మచ్చర్ల గ్రామానికి చెందిన సుంచ స్వప్న(37), కుమ్రంభీం ఆసిఫాబాద్  జిల్లా పెంచికల్ పేట్  మండలం గుండెపల్లికి చెందిన తలండి నారాయణ(61) వడదెబ్బతో అస్వస్థతకు గురై చనిపోయారు.