భద్రాచలంలో భారీగా గంజాయి స్వాధీనం

V6 Velugu Posted on Jun 16, 2021

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: సీక్రెట్ గా గంజాయి తరలిస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు. పక్కా సమాచారంతో భద్రాచలంలో బుధవారం పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో 40 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న గంజాయి విలువ 6 లక్షలు ఉంటుందని తెలిపారు. గంజాయిని తరలిస్తున్న నలుగురు ఘరానా దొంగలను అరెస్ట్ చేశారు. రెండేళ్లుగా 1.28 కోట్ల రూపాయల విలువైన గంజాయి అక్రమ రవాణా కేసులలో ఈ నలుగురు నిందితులుగా ఉన్నారని గుర్తించామన్నారు పోలీసులు.

Tagged POLICE, seizure, cannabis, marijuana, , Bhadrachalam.

Latest Videos

Subscribe Now

More News