అమ్రాబాద్, పదర మండలాల్లో దంచికొట్టిన వాన..

అమ్రాబాద్, పదర మండలాల్లో దంచికొట్టిన వాన..

అమ్రాబాద్, వెలుగు: అమ్రాబాద్, పదర మండలాల్లో శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. అమ్రాబాద్  పోలీస్ స్టేషన్, ప్రైమరీ స్కూల్, ఫైర్  స్టేషన్  ఆవరణతో పాటు ప్రధాన రహదారిపై వరద పోటెత్తింది. కత్వ వాగు వద్ద అడ్డుగా మట్టి వేయడంతో, వరద నీరు రోడ్డుపై పారింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గంట పాటు రాకపోకలు నిలిచిపోయాయి. లోకేశ్వరం చెరువులోకి భారీగా వరద నీరు చేరింది. ఇటీవల కురిసిన వర్షాలకు రైతులు పంటలు వేసుకోగా, భారీ వర్షం కారణంగా నష్టం కలుగుతుందని ఆందోళన చెందుతున్నారు.

ఉప్పునుంతల: మండలంలో శుక్రవారం సాయంత్రం వాన దంచి కొట్టింది. భారీ వర్షం కురవడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఇటీవల నాటిన పత్తి గింజలన్నీ మొలకెత్తుతాయని రైతులు ఆనందం వ్యక్తం చేశారు. సరైన సమయంలో వర్షం పడడంతో ముందుగా నాటిన పంటలకు జీవం పోసినట్లు అయిందని అంటున్నారు.