
హైదరాబాద్ సిటీ, వెలుగు: సిటీలో గురువారం సాయంత్రం వర్షం దంచికొట్టింది. ఉప్పల్లో ఏకంగా 9 సెంటిమీటర్ల వర్షం పడింది. ఉప్పల్, సికింద్రాబాద్, కూకట్‌పల్లి, ప్రగతినగర్, వివేకానందనగర్, మియాపూర్, మూసాపేట, శేరిలింగంపల్లి తదితర ప్రాంతాల్లో ఒక్కసారిగా వర్షం పడడంతో కాలనీల్లోకి వరద నీరు చేరింది. రోడ్లపై ఎక్కడికక్కడ వర్షపునీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. చాలాచోట్ల ట్రాఫిక్ స్తంభించింది. హైడ్రా మాన్సూన్ ఎమర్జెన్సీ, డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తమై వరద నివారణ చర్యల్లో నిమగ్నమయ్యాయి. ఈ సీజన్లో ఇదే అత్యధిక వర్షమని అధికారులు తెలిపారు.