జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ కు ఫిర్యాదుల వెల్లువ

జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ కు ఫిర్యాదుల వెల్లువ

హైదరాబాద్ నగరవ్యాప్తంగా వర్షం దంచికొట్టింది. బేగంపేట్ లోని సీఎం క్యాంప్ ఆఫీస్ ఎదుట, రాజ్ భవన్ రోడ్ లోని దిల్ ఖుషా గెస్ట్ హౌస్ ముందు భారీగా నీళ్లు నిలిచాయి. అత్యధికంగా బాలానగర్ లో 6.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మూసాపేట్ లో 5.4 సెంటీమీటర్లు, కేపీహెచ్బీలో 5.3 సెంటీమీటర్లు, గాజుల రామారం 5 సెంటీమీటర్లు,  హఫీజ్ పేట్, జీడిమెట్లలలో 4.9 సెంటీమీటర్లు, మియాపూర్ లో 4.5 సెంటీమీటర్లు, కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్, మూసాపేట్ లో 4 సెంటీమీటర్లు, మాదాపూర్, మౌలాలిలో 3.9 సెంటీమీటర్లు, జగద్గిరిగుట్టలో 3.7 సెంటీమీటర్లు, కాప్రా లో 3.5 సెంటీమీటర్లు, అల్వాల్ ,ఆర్సిపురంలో 3.4 సెంటీమీటర్లు, బేగంపేట్ లో 3.2 సెంటీమీటర్లు, నేరేడ్మెట్ ,మంచిలాల్ పేట్, శేర్లింగంపల్లిలో 3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. 

ఫిర్యాదుల వెల్లువ

భారీ వర్షం నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ కు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అత్యధికంగా రోడ్లపై నిలిచిన నీళ్లు,  పొంగిపొర్లుతున్న డ్రైనేజీలపై ఫిర్యాదులు వస్తున్నాయి. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న సిబ్బంది అలర్ట్ గా ఉండాలని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ ఆదేశించారు. రాబోయే మూడు నాలుగు గంటల్లో ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.