సమస్యలు వేధిస్తున్నాయా.. మీ ఆలోచనలు.. నమ్మకాలే పరిష్కార మార్గాలు.. ఎలాగంటే

సమస్యలు వేధిస్తున్నాయా.. మీ ఆలోచనలు.. నమ్మకాలే పరిష్కార మార్గాలు.. ఎలాగంటే

ప్రతి మనిషిని ఏదో ఒక సమస్య వేధిస్తూనే ఉంటుంది.  అప్పుడు మాత్రం జనాలకు దేవుడా ... నీవే దిక్కు.. నన్ను ఈ సమస్య నుంచి కాపాడు .. రక్షించు అంటూ నమ్మకంతో  ప్రార్ధిస్తారు. బాధ కలిగినప్పుడు, కష్టం వచ్చినప్పుడు మనుషులెవరూ ఆదుకోలేరని తెలిసినప్పుడు చాలామంది దేవుడి మీద భారం వేస్తారు. 'నువ్వు తప్ప వేరే దిక్కు లేదు స్వామీ..! మమ్మల్ని ఈ కష్టం నుంచి గట్టెక్కించు' అని మొక్కుకుంటారు.  దేవుడు చూసుకుంటాడులే అనే నమ్మకంతో ఉంటారు. అయితే ఆ మొక్కుకోవడంలోనే వాళ్లలో భగవంతుడిపై ఎలాంటి ఆలోచన ఉందో ఇట్టే తెలిసిపోతుంది.

శాంతి, ప్రేమ, సంతోషాలను నిధే ఆలోచన' అంటాడు వివేకానందుడు, భగవంతుడి గురించి ఆలోచన చేసేటప్పుడు కచ్చితంగా సంకల్పం, ఆత్మవిశ్వాసం, నమ్మకంతో ఉండాలి. ఎక్కడా అవి సడలకూడదు. కేవలం భగవంతుడి గురించే కాదు. లక్ష్యాన్ని సాధించేటప్పుడు, ఇతరుల సాయం కావాలనుకున్నప్పుడు, ఇష్టమైనపని చేసేటప్పుడు, ప్రేమాభిమానాలు పంచేటప్పుడు కూడా ఇలాంటి ఆలోచనే ఉండాలి. 

భాగవతంలోని గజేంద్రమోక్షంలో మొసలి చేతిలో చిక్కుకున్న ఏనుగు భగవంతుడి గురించి తెలుసుకునేందుకు ఆలోచిస్తుంది. ఆ ఆలోచన నుంచే భగవంతుడిని వెతుకుతుంది. చివరకు ప్రాణాలు దక్కించుకుంటుంది.గజేంద్రమోక్షంలో నీళ్లు తాగటానికి చెరువులోకి దిగిన ఏనుగు మొసలికి చిక్కుతుంది. దాని నుంచి ప్రాణాలు కాపాడుకోవడానికి మొదట పోరాడుతుంది. కానీ చివరకు తన శక్తి సరిపోదని తెలుసుకుంటుంది. చివరకు తనను కాపాడేవాళ్లు ఎవరని ఆలోచిస్తుంది. 

ALSO READ | Sleeping Tips: త్వరగా నిద్రపట్టడం లేదా.. అయితే ఈ చిట్కాలు పాటించండి..

ఈ ప్రపంచాన్ని ఎవరు సృష్టించారు? ఈ జగమంతా ఎవరి లోపల ఉంది? దీనికి మూలకారణం ఎవరు? అని ఆలోచన చేస్తుంది. ఏనుగులాగే ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు, సమస్య వచ్చిందని బాధపడి, ఎలా పరిష్కరించుకోవాలా అని తలమునకలయ్యే కంటే, దాని మూలాల గురించి ఆలోచించాలి. అంటే సమస్య ఎందుకు వచ్చింది?. అసలు కారణం ఏమిటి? అని తెలుసుకుంటే సులభంగా పరిష్కారం దొరుకుతుంది. అలాగే సమస్యను సొంతంగా పరిష్కరించుకోలేనప్పుడు ఎవరు తీరుస్తారు.? ఎవరి వల్ల సాధ్యం అవుతుంది? సమర్థులు. ఎవరు? అని తెలుసుకుంటే సగం సమస్య తీరినట్లే. ఏనుగు ఆ విధంగానే ఆలోచించింది. చివరికి విష్ణుమూర్తి సాయంతో ప్రాణాలు దక్కించుకుంది.

తప్పును గుర్తించాలి

ఏనుగు చేసిన మరో గొప్ప ఆలోచన తనకు సాయం చేసే వాళ్లు ఎక్కడ ఉన్నారో తెలుసుకోవడం. వైకుంఠపురంలో ఉన్న భవనంలో అమృత సరస్సులో, భార్యతో కలిసి ఉన్నాడని గుర్తించాకే.. నేను ప్రాణాలు పోయే స్థితిలో ఉన్నాను. నాకు సాయం చెయ్యి' అని వేడుకుంటుంది. కష్టాల్లో మొదట ఉన్నప్పుడు సాయం చేసే వ్యక్తి ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవాలి. అలాంటి వ్యక్తిని పట్టుకోవడమే సగం సమస్యకు పరిష్కారం దొరికినట్లు. అలాగే ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించుకోవాలంటే ముందుగా, ఆ తప్పు ఎక్కడ జరిగిందో గుర్తించాలి. గుర్తించకుండా సమస్య పరిష్కరించుకోలేరు. అలాగే ఆరోగ్యం బాగాలేనప్పుడు, ఎందుకు బాగాలేదో కారణం తెలుసుకోకుండా వైద్యం చేస్తే. రోగం నయంకాదు. ఇక్కడ ఏనుగు మాత్రం తనకువచ్చిన బాధను ఎవరు తీరుస్తారో, వాళ్లు ఎక్కడ ఉంటారో కరెక్టుగా ఆలోచించింది.

ఏనుగు మొసలి నుంచి కాపాడుకోవడం కోసం తనను ఎవరు రక్షిస్తారో మొదట ఆలోచించింది. తర్వాత అతడు ఎక్కడ, ఎలా ఉన్నాడో తెలుసుకుంది. మూడో విడతగా సమస్య గురించి వాళ్లకు చెప్పుకుంది. మొసలితో పోరాడి నా శరీరం అలసిపోయింది. శారీరక బలమే కాదు, మనోబలం కూడా పూర్తిగా తగ్గిపోయింది. ప్రాణాలు పోయేలా ఉన్నాయి. నాకు నువ్వు తప్ప వేరే ఎవరూ లేరు. దయతో నన్ను కాపాడు అని వేడుకుంది. సాయం చేసే వాళ్లకు, తమ గురించి, తాము ఉన్న పరిస్థితి గురించి చెప్పడం, ఒప్పించడం ఓ కళ. అది అందరికీ ఉండదు. కొందరికి మాత్రమే ఉంటుంది. ఇక్కడ ఏనుగు మాటతీరు చూస్తే కరుణ, జాలి తప్పకుండా కలుగుతాయి. అందుకే విష్ణుమూర్తి పక్కనున్న లక్ష్మీదేవిని కూడా పట్టించుకోకుండా ఆగమేఘాల మీద వస్తాడు. 

సమస్య వచ్చినప్పుడు చేయాల్సిన ఆలోచనలో మూడోది ఎలా పరిష్కరించాలా అని. అందుకు ఓపిక ఉండాలి. శక్తినంతా దానిపై పెట్టి, పనిచేయాలి. అంటే.. చావో, బతుకో తేల్చుకోవడం లాంటిదన్నమాట. ఇక్కడ ఏనుగు కూడా భారం మొత్తం విష్ణుమూర్తి పైనే వేసింది. ఇక నువ్వు తప్ప వేరే లేరని చెప్పేసింది. దాంతో విష్ణుమూర్తి వచ్చి ఏనుగును కాపాడతాడు.

నమ్మకం లేకపోతే...

దేవుడిని పూర్తిగా నమ్మాలి అని చెప్తారు.నమ్మకం లేకపోతే దేవుడు సాయం చేయడనికూడా అంటుంటారు. ఏనుగు విష్ణుమూర్తినిపూర్తిగా నమ్మింది. భారం మొత్తం అతడి మీదేవేసింది. అప్పుడే విష్ణువు వచ్చి కాపాడాడు. చేసేఆలోచన పూర్తిగా నమ్మకంతో ఉండాలి. లేదంటే మొదటికే మోసం వస్తుంది. కేవలం ఆలోచన అనేది దేవుడి గురించే కాదు. సాటి మనుషులు,చేసే పని విషయంలోనూ పాజిటివ్ దృక్పథంతోఉండాలి. అలాంటి ఆలోచనే సమస్యల నుంచి బయటపడేస్తుంది. సంతోషంగా ఉండేలాచేస్తుంది. ఎక్కువమంది మాభిమానాలుపొందొచ్చు. అందుకే చేసే ఆలోచన మంచిదనిఎవరికి వాళ్లు ముందు నమ్మాలి. నమ్మినతర్వాత ఆచరణలో పెట్టాలి. అప్పుడే విజయం తప్పక సాధ్యమవుతుంది. ఏనుగు దేవుడిగురించి పూర్తి నమ్మకంతో ఆలోచించింది.

సమస్య వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించుకోవాలంటే ముందుగా, ఆ తప్పు ఎక్కడ జరిగిందో గుర్తించాలి. గుర్తించకుండా సమస్య పరిష్కరించుకోలేరు. అలాగే ఆరోగ్యం బాగాలేనప్పుడు, ఎందుకుబాగాలేదో కారణం తెలుసుకోకుండా వైద్యం చేస్తే. రోగం నయంకాదని తెలుసుకోవాలి. .