IPL 2024: ఆరేళ్ల తర్వాత ఐపీఎల్‌ ఫైనల్లో సన్‌రైజర్స్.. కావ్య పాప సెలబ్రేషన్స్‌ చూడండి

IPL 2024: ఆరేళ్ల తర్వాత ఐపీఎల్‌ ఫైనల్లో సన్‌రైజర్స్.. కావ్య పాప సెలబ్రేషన్స్‌ చూడండి

చెపాక్ గడ్డపై రాజస్థాన్‌ని చిత్తు చేసి సన్‌రైజర్స్ జట్టు ఫైనల్‌లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. శుక్రవారం(మే 24) జరిగిన రెండో క్వాలిఫైయర్‌లో కమిన్స్ సేన 36 ప‌రుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. ఆరేళ్ల త‌ర్వాత త‌మ జ‌ట్టు ఫైన‌ల్లో అడుగుపెట్టడంతో హైదరాబాద్ యాజమాన్యం ఆనందానికి అవ‌ధులు లేకుండాపోయాయి. ఆటగాళ్లు క్లాప్స్‌తో సరిపెట్టుకుంటే.. యజమానులు మాత్రం ఎగిరి గంతేశారు. సహచరులతో చేయి చేయి జోడిస్తూ తమ ఆనందాన్ని పంచుకున్నారు. 

కావ్య పాప ఎక్స్‌ప్రెసెన్స్

గతేడాది సన్‌రైజర్స్‌ ఆటగాళ్లు దారుణంగా విఫలమయ్యారు. ఆ సమయంలో కావ్య పాప(కావ్య మారన్) ఎక్స్‌ప్రెసెన్స్ అందరినీ బాధించాయి. ఈ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో తమిళ సూపర్ స్టార్ హీరో రజినీకాంత్ సైతం ప్రస్తావించారు. జట్టు ఓడిపోయిన ప్రతిసారి ఆమె(కావ్య) పడిన బాదేంటో తనకు తెలుసని తెలిపారు. ఆమె ఆనందం కోసమైనా హైదరాబాద్ జట్టును విజయాలు వారించాలని ఆకాక్షించారు. తలైవా చెప్పినట్లుగానే కమ్మిన్స్ అద్భుతం చేశాడు. తనపై పెట్టిన 20 కోట్ల రూపాయలకు న్యాయం చేస్తూనే జట్టును ఫైనల్ చేర్చాడు.

శుక్రవారం(మే 24) జరిగిన రెండో క్వాలిఫైయర్‌లో రాజస్థాన్ ఓటమి ఐదు ఓవర్ల ముందే ఖాయమైంది. ఆ సమయంలో కావ్య మారన్ ఆనందం చూడాలి. కుదురుగా ఒక చోట కూర్చోలేకపోయింది. ఇక ఆఖరి బంతి పడగానే ఆనందంతో గంతులేసింది. ఆప్యాయంగా తండ్రిని హత్తుకొని.. "చూశావా నీ కూతురు సత్తా.. జట్టును ఫైనల్ చేర్చింది.." అనేలా  ఎక్స్‌ప్రెసెన్స్ ఇచ్చింది. విజయం సాధించాక ఎగ్జైట్ అవుతూ ఆమె పలికించిన హావభావాలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

మూడోసారి..

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఫైనల్ చేరడం ఇది మూడోసారి. మొదటిసారి 2016లో తుదిపోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరును మట్టి కరిపించి ట్రోఫీ సొంతం చేసుకుంది. అనంతరం 2018లో మరోసారి ఫైనల్ చేరినా.. ధోని నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓటమిపాలైంది.

కోల్‌కతాతో అమీ తుమీ

రెండో క్వాలిఫైయర్‌లో రాజస్థాన్‌ని ఓడించిన సన్‌ రైజర్స్, మే 26న కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఫైనల్‌లో తలపడనుంది. క్వాలిఫైయర్‌-2 జరిగిన చెపాక్ వేదికపైనే ఈ మ్యాచ్ జరగనుంది. 

మరిన్ని వార్తలు