Anjali: అందుకే బూతులు మాట్లాడాను.. క్లారిటీ ఇచ్చిన అంజలి

Anjali: అందుకే బూతులు మాట్లాడాను.. క్లారిటీ ఇచ్చిన అంజలి

తెలుగు నటి అంజలి(Anjali) గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఎవరైనా ఇంట గెలిచి రచ్చ గెలవమంటారు. కానీ, అంజలి విషయంలో మాత్రం అది రివర్స్ అనే చెప్పాలి. తెలుగమ్మాయి అయినా ఆమె ముందుకు తమిళ సినిమా ద్వారా ఫేమస్ అయ్యారు. ఆ తరువాత సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో అవకాశం దక్కించుకుంది. ఈ సినిమా సూపర్ సక్సెస్ తరువాత వరుస అవకాశాలు అందుకుంది అంజలి.

ఇక తాజాగా ఆమె నటిస్తున్న గ్యాంగ్స్ గోదావరి సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. మాస్ కా దాస్ హీరోగా వస్తున్న ఈ సినిమా మే 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ లో నిమగ్నమయ్యారు టీమ్. ఇందులో భాగంగా ఇటీవల నిర్వహించిన మీడియా మీట్ లో ఆసక్తికర కామెంట్స్ చేశారు అంజలి. అదేంటంటే.. ఈ సినిమాలో రత్నమాల అనే మాసీ క్యారెక్టర్ లో కనిపించనున్నారు అంజలి. అంతేకాదు.. ఆ పాత్ర కోసం మొదటిసారి బూతులు మాట్లాడారట. ఇదే విషయంపై క్లారిటీ ఇచ్చారు ఆమె. 

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో నేను రత్నమాల అనే మాసీ పాత్రలో నటించాను. నా కెరీర్ లో ఇంతకుముందు ఎప్పుడు ఇలాంటి పాత్ర చేయలేదు. ఒక సినిమాలో బూతులు మాట్లాడటం ఇదే ఫస్ట్ టైమ్. నిజ జీవితంలో కూడా ఎప్పుడు బూతులు వాడను. అలాంటిది రత్నమాల పాత్ర కోసం దర్శకుడు నన్ను అనుకోవడం ఆశ్చర్యంగా అనిపించింది.. అంటూ చెప్పుకొచ్చారు అంజలి.