Jay Shah: వరల్డ్ కప్ గెలవాలి తిరుమలేశా..! వేంకటేశ్వరుడిని దర్శించుకున్న జై షా

Jay Shah: వరల్డ్ కప్ గెలవాలి తిరుమలేశా..! వేంకటేశ్వరుడిని దర్శించుకున్న జై షా

బీసీసీఐ సెక్రటరీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుమారుడు జై షా.. కలియుగదైవం శ్రీ వేంకటేశ్వరుడిని దర్శించుకున్నారు. శనివారం(మే 25) ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో జై షా.. తల్లి సోనాల్ షాతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం ఆలయ అధికారులు వారికి తీర్థప్రసాదాలు అందజేశారు. 

వరల్డ్ కప్ కోసమేనా..!

జై షా తిరుమలేశుడిని దర్శించుకోవడంపై నెట్టింట జోరుగా చర్చ జరుగుతోంది. ఆయన సందర్శనకు ఐపీఎల్ పదిహేడో సీజన్ విజయవంతంగా ముగియనుండటం కారణమని కొందరంటే, టీ20 ప్రపంచకప్ గెలవాలని ఆకాక్షించడానికే వచ్చి ఉండవచ్చని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

కాగా, టీ20 ప్రపంచ కప్ 2024 సమరం కోసం నేడు(మే 25) కొందరు భారత ఆటగాళ్లు అమెరికా బయలుదేరి వెళ్లనున్నారు. శనివారం రాత్రి 10 గంటల సమయంలో వీరి ఫ్లైట్ గాలిలోకి ఎగరనున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు