లంచం డబ్బులతో దొరికిన రావులపాలెం పోలీస్ సీఐ

లంచం డబ్బులతో దొరికిన రావులపాలెం పోలీస్ సీఐ

ఏసీబీ వలకు మరో అవినీతి అధికారి అధికారి దొరికాడు.రావులపాలెం పోలీస్ స్టేషన్ పై అవినీతి నిరోధక శాఖ జరిపిన ఆకస్మిక దాడుల్లో లంచం డబ్బుతో దొరికాడు రావులపాలెం సీఐ. టౌన్ సీఐగా వ్యవహరిస్తున్న ఆంజనేయులు యాభైవేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా బుక్కయ్యాడు. 

గత నెలలో దొరికిన కోడి పందేల నిర్వాహకుడు లక్ష్మణ్ నుండి 50వేలు లంచం డిమాండ్ చేయటంతో అతను ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు.లక్ష్మణ్ ఫిర్యాదుతో పోలీస్ స్టేషన్ పై దాడి చేసి సీఐ ఆంజనేయులును పట్టుకున్నారు రాజమండ్రి ఏసీబీ అధికారులు.సీఐ ఆంజనేయులును అదుపులోకి తీసుకున్న అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.